ఫైనల్ గా రామ్ చరణ్ పుట్టిన రోజుకు ఎన్టీఆర్ ఇస్తానన్న సర్ ప్రైజ్ వీడియో వచ్చేసింది. నిజానికి ఈ రోజు 10 గంటలకే ఈ వీడియో రిలీజ్ అవ్వాలి. కానీ ఎందుకు లేట్ అయిందో తెలుసుగా. ఉదయం నుండి ట్విట్టర్ లో ఈ హడావుడే నడుస్తుంది. తాను పంపిస్తానన్న వీడియో నిట రాజమౌళి కి పంపించానని.. నీకు తెలుసుగా చరణ్ రాజమౌళి తో ఎలా ఉంటుందో.. సారి అంటూ ట్వీట్ చేయగా దానికి చరణ్ కూడా ఆయనకు పంపావా.. ఎప్పుడొస్తుంది అంటూ సెటైర్లు వేశారు. ఇక చిరు కూడా వీడియో కోసం ఎదురుచూస్తున్నాను అని ట్వీట్ చేయగా దానికి రాజమౌళి… ‘సా..ర్.. అంటే.. అది.. కొంచం.. కొంచమే.. ప్లీజ్.. సర్’ అని ట్వీట్ చేశారు. కొంచం ఆలస్యం అవుతుందని చెప్పారు. దీనిపై చిరు స్పందిస్తూ.. ‘అర్థమైంది.. జక్కన్న గారూ’ అని చెప్పారు. ఇక ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న వీడియో రానే వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆడు కనపడితే నిప్పు కణం నిలవడినట్టుంటది… కలవడితే ఏగుసుక్క ఎగవడినట్టుంటది.. ఎదురువడితే సావుకైనా సెమట ధారగడతది అంటూ.. ఇంటి పేరు అల్లూరి.. సాకింది గోదారి.. నా అన్న మన్నెం దొర అల్లూరి సీతా రామరాజు అంటూ ఎన్టీఆర్ వాయిస్ తో చెప్పిన డైలాగ్స్ నిజంగా ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. నిజంగా ఎన్టీఆర్ ఇచ్చిన సర్ప్రైజ్ వీడియో అదిరిపోయింది.




రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు.
ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























