కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 152

Ram Charan Sensational Hit Rangasthalam Completes Two Years
సినిమా వార్తలు

రామ్ చ‌ర‌ణ్ ‘రంగ‌స్థ‌లం’కు రెండేళ్ళు

అన్నద‌మ్ముల సెంటిమెంట్‌తో తెలుగునాట ప‌లు చిత్రాలు సంద‌డి చేశాయి. వాటిలో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ‘రంగ‌స్థ‌లం’ ఒక‌టి. ఇందులోని “చిట్టిబాబు” పాత్ర‌లో చ‌ర‌ణ్ అభిన‌యించిన తీరు విమ‌ర్శ‌కుల‌ను సైతం క‌ట్టిప‌డేసింది. బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ రూపొందించిన ఈ 80ల‌నాటి పిరియాడిక్ యాక్ష‌న్ డ్రామాలో స‌మంత క‌థానాయిక‌గా న‌టించింది. ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాష్ రాజ్, న‌రేష్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్, రోహిణి, బ్ర‌హ్మాజీ, రాజీవ్ క‌న‌కాల‌ ముఖ్య పాత్ర‌లు పోషించ‌గా... స్ట‌న్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించింది.

Team TFNవాట్సాప్
Chiranjeevi Comes Forward To Help Cine Workers
సినిమా వార్తలు

సినీ కార్మికుల కోసం చిరు ప్రత్యేక చారిటీ

సినీ కార్మికుల కోసం ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చి ఆర్ధిక సాయం అందించిన సంగతి తెలిసిందే. ఎక్కడి సినిమాలు అక్కడ వాయిదా పడటం... షూటింగ్ లు ఆగిపోవడంతో నిత్యావసరాలకి వాళ్ళకి చాలా కష్టమవుతుంది. ఇప్పటికే పలువురు అగ్రనటులు సినీ కార్మికుల కోసం భారీ ఎత్తున విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ సినీ కార్మికుల సంక్షేమానికి ముందుకువచ్చారు. కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) పేరిట ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. సీసీసీ చైర్మన్ గా చిరంజీవి వ్యవహరించనుండగా, కమిటీ సభ్యులుగా డి.సురేశ్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్ వ్యవహరిస్తారు. తెలుగు చలనచిత్ర…

TFN Adminవాట్సాప్
Nikhil Siddharth Upcoming Movie 18 Pages Team Continue Movie Work Despite Lockdown
సినిమా వార్తలు

'లాక్ డౌన్' అయినా ఆగని నిఖిల్ '18 పేజీస్'

కుమారి 21 ఎఫ్‍ ఫేమ్‍ పల్నాటి సూర్య ప్రతాప్‍ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా '18 పేజీస్' సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఉప్పెన కృతి శెట్టి ని సెలెక్ట్ చేశాడు సుకుమార్. ఈ చిత్రానికి సుకుమార్ కథ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తుండగా సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Work From Home Is Not An Easy Task Says SS karthikeya
సినిమా వార్తలు

వర్క్ ఫ్రమ్ హోమ్ అంత ఈజీ కాదు

ఇంటినుండి పని చేయడం అంత ఈజీ కాదు అంటున్నాడు రాజమౌళి తనయుడు కార్తికేయ. అసలు సంగతేంటంటే...కరోనా వల్ల చాలా మంది ఇంటి నుండే పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వర్క్ కేవలం ఆఫీస్ కు వెళ్లే వాళ్ళు మాత్రమే కాదు సినిమా వాళ్ళు కూడా ఇంటి నుండే తమ ఇంటి నుండే పనులను చక్కబెడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే రాజమౌళి ఇప్పటికే ఇంటిలో వుండే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాడు. ఇక నిన్న చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చెర్రీ ని ఇంట్రడ్యూస్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో అయితే అదిరిపోయింది. రాంచరణ్ యాక్షన్ , ఎన్టీఆర్ డైలాగ్స్ తో గూస్ బంప్స్ వచ్చాయి. అయితే క్రమంలోనే కార్తికేయ తన ట్విట్టర్ ద్వారా తన టీమ్ ను ప్రశంసించాడు. ఈ…

TFN Adminవాట్సాప్
Akkineni Nagarjuna Joins Tollywood Bandwagon To Help Cine Workers
సినిమా వార్తలు

సినీ కార్మికులకు 'కింగ్' సాయం

కరోనా ఎఫెక్ట్ పలు పరిశ్రమలపై బాగానే పడింది. ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమపై ఈ ఎఫెక్ట్ బాగా పడింది. హీరోలు, హీరోయిన్స్ ఇంట్లోనే వుండండి... బయట తిరగకండి.. కరోనాను తరిమికొట్టండి అంటూ సూచనలు ఇస్తున్నారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉంది. వీళ్లకు ఆర్థికంగా ఎలాంటి సమస్య లేదు కాబట్టి ఇంకో రెండు మూడు నెలలు ఇలానే వున్నా వాళ్లకు పెద్ద ప్రాబ్లమ్ లేదు. కానీ సినీ కార్మికులకు మాత్రం ఇది పెద్ద సమస్యనే. షూటింగ్‌లు రద్దవ్వడంతో సినీ కార్మికులకు ఉపాధి కరువయింది. పేద సినీ కార్మికులకు కష్టంగా మారింది.

TFN Adminవాట్సాప్
Super Star Mahesh Babu Tweets To Support Cineworkers At This Crisis Moment
సినిమా వార్తలు

TFI వర్కర్స్ కై మహేష్ బాబు ట్వీట్

కరోనా వైరస్ కారణంగా పరిస్థితులు విషమంగా తయారయ్యాయి. ప్రధాని మోదీ ప్రజా శ్రేయస్సు కై 21 రోజులు లాక్ డౌన్ విధించడంతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. కరోనా మహమ్మారి కట్టడి కై సినీ ప్రముఖులు పిఎమ్, సి ఎమ్ రిలీఫ్ ఫండ్స్ కు భారీగా విరాళాలు అందజేసిన విషయం తెలిసిందే. కోటి రూపాయలు విరాళమిచ్చిన మహేష్ బాబు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్కర్స్ కై 25 లక్షలు విరాళం ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Anushka Shetty To Do A Biopic Based On Bengaluru Nagaratnamma Life Story
సినిమా వార్తలు

బెంగుళూరు నాగరత్నమ్మ బయోపిక్ లో అనుష్క ?

మయూరి, పుష్పక విమాన (సైలెంట్ మూవీ ), అపూర్వ సహోదరగళ్ , మైకేల్ మదన కామరాజన్, ఆదిత్య 369, మేడమ్, భైరవ ద్వీపం, వెల్ కమ్ ఒబామ వంటి వైవిధ్య కథా చిత్రాలను తెరకెక్కించిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు ఇప్పుడు ఒక బయోపిక్ మూవీ ని తెరకెక్కించనున్నారు. కర్నాటిక్ సింగర్, స్కాలర్, యాక్టివిస్ట్ బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర ఆధారంగా ఒక మూవీని సింగీతం రూపొందించనున్నారు.

Team TFNవాట్సాప్
Kajal Aggarwal Revisits Her Childhood Memory
సినిమా వార్తలు

కాజల్ అగర్వాల్ బాల్య జ్ఞాపకం

80లలో దూర దర్శన్ లో ప్రసారమైన "రామాయణ్", " మహాభారత్" సీరియల్స్ పేక్షకులను ఉర్రూత లూగించిన విషయం తెలిసిందే. ఇప్పటిలా మల్టీ ప్లెక్స్ లు, ఇంటర్ నెట్, OTT ప్లాట్ ఫారమ్స్ లేని రోజుల్లో 30 సంవత్సరాల క్రితం టీవీ లే ప్రేక్షకులకు వినోద సాధనం. 1987 సంవత్సరంలో దూరదర్శన్ లో "రామాయణ్" సీరియల్ 85 వారాల పాటు ప్రసారం జరిగింది. ఆ సమయంలో పిల్లలతో పాటు పెద్దలు కూడా టీవీ లకు అతుక్కుపోయేవారు. 1988 సంవత్సరం " మహాభారత్" సీరియల్ దూర దర్శన్ లో ప్రసారమైంది. రెండు సీరియల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Actress Kajal Aggarwal Rekindles Her Childhood Memories About Watching Her Favourite TV Shows
సినిమా వార్తలు

రామాయ‌ణం చూస్తున్నాను..బాల్యం గుర్తొస్తుంది

మొత్తానికి కరోనా ఎఫెక్ట్ వల్ల అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇక సామాన్య ప్రజల సంగతేమో కానీ సెలబ్రిటీస్ కు మాత్రం ఈ టైమ్ మంచిగా కలిసొస్తుంది. ఎందుకంటే.. మాములు రోజుల్లో వాళ్ళు ఇంటిలో ఉండటం చాలా కష్టం. కానీ ఇప్పుడు ఇంటిలోనే ఉంటూ ఫ్యామిలీతో గడుపుతున్నారు. కొంత మంది వర్క్ అవుట్స్, ఇంటి పనులు చేసుకుంటూ, వంటలు చేస్తూ, సినిమాలు చూస్తూ ఇలా తమ టైమ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు అందుబాటులో ఉంటున్నారు. వారి సినిమా వివ‌రాల‌ను, రోజంతా ఇంట్లో కాల‌క్షేపం చేస్తున్న ప‌నుల‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

TFN Adminవాట్సాప్
Super Star Mahesh Babu Plans To Release His Next On Pokiri Release Date
రిలీజ్ అప్‌డేట్

'పోకిరి' రిలీజ్ డేట్ కి మహేష్ నెక్స్ట్ ఫిలిం రిలీజ్ ప్లాన్..!

ఈ ఏడాది సంక్రాంతికి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ ఏం సినిమా చేస్తాడా అన్నది మాత్రం గత కొద్దిరోజులుగా కన్ఫ్యూజన్ గా ఉంది. అయితే ముందు వంశీ పైడి పల్లి తోనే ఉంటుంది అన్నారు. కానీ వీరిద్దరి సినిమా ఇప్పట్లో లేదు. ఇప్పుడు మరో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. మహేష్ తర్వాత సినిమా పరుశురాం తో కానీ... వెంకీ కుడుముల తో కానీ ఉంటుంది. దీనిపై త్వరలోనే ఒక క్లారిటీ రానుంది. అంతేకాదు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా మే 31న లాంచనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంచించాలని ప్లాన్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Awe Director Prashanth Varma To Make A Movie Based On Corona Virus
సినిమా వార్తలు

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ మూవీ

కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రాణ భయం తో ప్రజలు ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర, రెండు తెలుగు రాష్ట్రాలు విశేష కృషి చేస్తున్నాయి. ప్రాణాలకు తెగించి వైద్య బృందాలు, పోలీస్ శాఖ, అనేక డిపార్ట్ మెంట్స్ ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడుకరోనా మహమ్మారి నేపథ్యంలో ఒక మూవీ రూపొందనుంది.

Team TFNవాట్సాప్
Kamal Hassan Offers His Residence To Treat Covid-19 Patients
సినిమా వార్తలు

'కరోనా' కోసం కమల్ ఆఫర్ - నా ఇంటిని హాస్పిటల్ గా మారుస్తా

చైనా లో పుట్టి ఇప్పుడు ప్రపంచాన్నే వ‌ణికిస్తుంది క‌రోనా. ఇక ఈ మహమ్మారి వైరస్ ను క‌ట్ట‌డి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చేసేశారు. ఇక సినీ ప్ర‌ముఖులు కూడా త‌మ వంతు సాయం అందించేందుకు ముందుకు వ‌స్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నుండి సినీ తారలు కోట్ల రూపాయలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. కానీ ఒక హీరో మాత్రం వీరందరికీ కాస్త విభిన్నంగా ఒక సాయం అందించడానికి ముందుకొచ్చాడు. ఆ హీరో ఎవరో కాదు... కమల్ హాసన్.

TFN Adminవాట్సాప్
Megastar Chiranjeevi and Mohan Babu Engage In a Fun Banter On Twitter
సినిమా వార్తలు

టామ్ అండ్ జెర్రీ లా చిరు-మోహన్ బాబుల ట్వీట్స్

మొత్తానికి మెగా స్టార్ చిరంజీవి అలా ట్విట్టర్ లోకి అడుగుపెట్టారో లేదో కానీ ఇప్పటి వరకూ ఎప్పుడూ లేనంత హడావుడి నడుస్తుంది. మన హీరోల్లా ఏదో వాడాంలే.. ఒక ట్వీట్ చేశాం మన పని అయిపోయింది అన్నట్టు కాకుండా... రోజుకు రెండు మూడు ట్వీట్స్ తో ఫుల్ యాక్టీవ్ లో వుంటున్నారు. దీనికి తోడు కరోనా వల్ల ఇంట్లోనే ఉండటంతో ట్విట్టర్ వేదికగా కామెడీ ట్వీట్స్ తో చిరు కామెడీ చేస్తున్నారు. ఇక ఇప్పుడు తన స్నేహితుడు మోహన్ బాబు తో కూడా చమత్కరించారు. సోషల్ మీడియా లోకి అడుగుపెట్టినందుకు గానూ అందరు చిరుకి ప్రేమతో ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు కూడా వెల్ కమ్ చెప్పాడు. దానికి చిరు థ్యాంక్స్ మిత్రమా.. 'రాననుకున్నావా…

TFN Adminవాట్సాప్
Young Tiger NTR Blockbuster Movie Aadi Completes 18 Years
సినిమా వార్తలు

యంగ్‌ టైగ‌ర్ య‌న్టీఆర్ ‘ఆది’కి 18 ఏళ్ళు

యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌కు కెరీర్ ఆరంభంలో బాగా క‌లిసొచ్చిన ద‌ర్శ‌కుల్లో వి.వి.వినాయ‌క్ ఒక‌రు. అలాంటి వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన తొలి చిత్రం ‘ఆది’. ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ మూవీలో య‌న్టీఆర్ స‌ర‌స‌న కీర్తి చావ్లా హీరోయిన్‌గా న‌టించింది. రాజ‌న్.పి.దేవ్, ‘ఆహుతి’ ప్ర‌సాద్, చ‌ల‌ప‌తిరావు, అలీ, య‌ల్.బి.శ్రీ‌రామ్, యం.ఎస్.నారాయ‌ణ‌, రాజీవ్ క‌న‌కాల‌, వేణు మాధవ్ త‌దితరులు ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించారు.

Team TFNవాట్సాప్
Nandamuri Balakrishna - Boyapati Legend Completes 6 Years
సినిమా వార్తలు

న‌ట‌సింహ బాల‌కృష్ణ ‘లెజెండ్’కు ఆరేళ్ళు

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయ‌పాటి శ్రీ‌నుది స‌క్సెస్‌ఫుల్ కాంబినేషన్. అలాంటి బాలయ్య, బోయపాటి క‌ల‌యిక‌లో ‘సింహా’(2010) వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత వ‌చ్చిన రెండో చిత్రం ‘లెజెండ్‌’. బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యం చేసిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ క‌థానాయిక‌లుగా న‌టించారు. జ‌గ‌ప‌తిబాబు, సుమ‌న్, బ్ర‌హ్మానందం, జ‌యప్రకాష్ రెడ్డి, అజ‌య్, బ్ర‌హ్మాజీ, ‘ఆహుతి’ ప్ర‌సాద్, సుజాతా కుమార్, క‌ళ్యాణి, ఈశ్వ‌రీ రావు, సితార‌ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. సుహాసిని అతిథి పాత్ర‌లో కనిపించగా... హంసా నందిని ఐట‌మ్ సాంగ్‌లో న‌ర్తించింది.

Team TFNవాట్సాప్
Bollywood Actor Sunny Deol Collabs With South Indian Director Hanu Raghavapudi For An Action Thriller Movie
సినిమా వార్తలు

హను రాఘవపూడి దర్శకత్వంలో సన్నీ డియోల్

సక్సెస్ ఫుల్ "అందాల రాక్షసి " మూవీ తో టాలీవుడ్ కు హను రాఘవపూడి దర్శకుడిగా పరిచయం అయ్యారు. హను దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన "కృష్ణ గాడి వీర ప్రేమ గాథ " మూవీ విజయం సాధించింది. నితిన్ హీరోగా రూపొందించిన "లై , శర్వానంద్ హీరోగా రూపొందించిన "పడి పడి లేచె మనసు " మూవీస్ నిరాశ పరిచాయి. ఇప్పుడు సన్నీ డియోల్ హీరోగా ఒక బాలీవుడ్ మూవీ కి హను రాఘవపూడి కి ఛాన్స్ వచ్చింది.

Team TFNవాట్సాప్
Mass Maharaja Ravi Teja Once Again To Act In a Periodic Drama Movie
సినిమా వార్తలు

మ‌ళ్ళీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో ర‌వితేజ‌?

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. అందులో ఒక‌టి `క్రాక్` కాగా.. మ‌రొక‌టి `రాక్ష‌సుడు` ఫేమ్ ర‌మేష్ వ‌ర్మ రూపొందిస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్. ఈ రెండు చిత్రాల‌తో పాటు... ‘సినిమా చూపిస్త మావ‌’, ‘నేను లోక‌ల్’ వంటి కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ను తెర‌కెక్కించిన త్రినాథ‌రావు న‌క్కిన‌తో కూడా ఓ అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌నున్నాడు ర‌వితేజ‌. త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌నుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నం టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Team TFNవాట్సాప్
Varun Tej and Lavanya Tripathi Combo Hits Hat Trick
సినిమా వార్తలు

మ‌రోసారి వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య‌ త్రిపాఠి జోడీ?

‘మిస్ట‌ర్‌’, ‘అంత‌రిక్షం’ చిత్రాల‌లో జంట‌గా న‌టించి అల‌రించారు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, ‘అందాల రాక్ష‌సి’ లావ‌ణ్య‌ త్రిపాఠి. కాగా, ఈ ఇద్ద‌రు ముచ్చ‌ట‌గా మూడోసారి జ‌ట్టుక‌ట్టనున్న‌ట్టు స‌మాచారం.

Team TFNవాట్సాప్
Legendary Director K Raghavendra Rao Milestone Movie Gangothri Completes 17 Years
సినిమా వార్తలు

ద‌ర్శ‌కేంద్రుడి వందో చిత్రం, బ‌న్నీ తొలి సినిమా‘గంగోత్రి’కి 17 ఏళ్ళు

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు... గ్లామ‌ర్ ప్రియుల‌కు ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేని పేరు. తెలుగు తెర‌పై గ్లామ‌ర్‌కి కొత్త గ్రామ‌ర్ నేర్పిన దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు. అంతేకాదు... బాక్సాఫీస్‌కీ కొత్త లెక్క‌లు నేర్పారాయ‌న‌. అగ్ర క‌థానాయ‌కుల‌తోనే కాదు నూత‌న తార‌ల‌తో, మీడియం రేంజ్ హీరోల కాంబినేష‌న్ లోనూ సంచ‌ల‌నాలు సాధించారు ఈ శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌క దిగ్గ‌జం.

Team TFNవాట్సాప్
Actor Nithiin To Play Three Different Roles In Power Peta Movie
సినిమా వార్తలు

యువకుడిగా ..మధ్య వయస్కుడిగా ..వృద్ధుడిగా

చాలా గ్యాప్ తర్వాత భీష్మ సినిమాతో మంచి హిట్ కొట్టాడు నితిన్. నితిన్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా భీష్మ కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన నితిన్ ఖాతాలో పలు సినిమాలే ఉన్నాయి. ప్రస్తుతం దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. నాగవంశీ సితార బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్

షేర్