సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార సోషల్ మీడియా లో కొత్త కొత్త వీడియోస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కరోనా వైరస్ పై అవగాహన పెంచేలా ఒక వీడియో రూపొందించింది. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోలేకపోవడం కరోనా లక్షణాలు గా చెబుతూ, అటువంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించండని, 5 సూచనలు అందరూ తప్పక పాటించాలని సితార చెప్పింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Golden rules!! When kids speak…u listen…#StayHomeStaySafe 🙏🏻🙏🏻 pic.twitter.com/v8Ih3ps8D0
— Mahesh Babu (@urstrulyMahesh) March 27, 2020
సామాజిక దూరం పాటించడం, చేతులు తరుచూ శుభ్రపరుచుకొనటం, చుట్టు పక్కలవారికి 3 మీటర్ల దూరం గా ఉండటం, చేతులతో కన్ను, చెవి, నోటిని తాకకుండా ఉండటం, దగ్గు, తుమ్ము వచ్చినపుడు మోచేతిని అడ్డుపెట్టు కొనటం వంటి సూచనలతో ఇంటిలో ఉండండి కరోనా ను తరిమికొట్టండి అంటూ వీడియో ద్వారా సితార తెలిపింది. ఆ వీడియో ను ట్విట్టర్ ద్వారా షేర్ చేసి, పిల్లలు చెప్పిన మాటలు వినండి అంటూ మహేష్ బాబు కామెంట్ పెట్టారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: