“RRR” లో అతిథి పాత్రలో విజయ్ ?

Thalapathy Vijay To Play A Guest Role In Rajamouli Prestigious Movie RRR

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం “మూవీ సంక్రాంతి కానుకగా 2021సంవత్సరం జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు కాగా అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తుపాకి , మెర్సల్, సర్కార్, బిగిల్ వంటి సూపర్ హిట్ తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ద్వారా ప్రేక్షకులను అలరించిన తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ ఈ మూవీ లో అతిథి పాత్రలో నటించనున్నారని సమాచారం. కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్ రద్దు కావటంతో “రౌద్రం రణం రుధిరం “మూవీ షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఉగాది పండగ సందర్భంగా “రౌద్రం రణం రుధిరం “మూవీ మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్ లతో పాటు తమిళ సూపర్ స్టార్ విజయ్ కూడా తోడయితే ఈ మూవీ బ్లాక్ బస్టరే అనడంలో సందేహం లేదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − seven =