ఎవరికీ తెలియని నిజం ?

This Interesting Unknown Fact About This Tollywood Ace Writer And Producer Will Surprise You

స్టార్ రైటర్ , నిర్మాత, యాక్టర్, గీత రచయిత, డైలాగ్ రైటర్ , దర్శకుడు కోన వెంకట్ సక్సెస్ ఫుల్ గా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. 1997 సంవత్సరంలో “తోక లేని పిట్ట ” మూవీ తో కోన వెంకట్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ దారుణంగా పరాజయం పొందింది. సత్య, దిల్ సే , కౌన్, మస్త్ , జంగిల్, కంపెనీ వంటి హిందీ మూవీస్ కు తెలుగు డబ్బింగ్ రైటర్ గా పనిచేసిన కోన వెంకట్ “ఒకరికి ఒకరు ” సక్సెస్ ఫుల్ మూవీ తో టాలీవుడ్ లో రైటర్ గా మారారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కోన రైటర్ గా పనిచేసిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, వెంకీ, సాంబ, ఢీ, రెడీ, అదుర్స్, డాన్ శీను, దూకుడు, దేనికైనా రెడీ, బాద్ షా, బలుపు, గీతాంజలి, ,పవర్, లౌక్యం, పండగ చేస్కో, నిన్నుకోరి, జై లవ కుశ మూవీస్ ఘనవిజయం సాధించాయి. కోన ఫిల్మ్ కార్పొరేషన్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి ” గీతాంజలి”, “నీవెవరో”, “నిన్నుకోరి” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ కు సహ నిర్మాత గా వ్యవహరించిన కోన వెంకట్ ఇప్పుడు సహనిర్మాతగా వ్యవహరించిన,స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన థ్రిల్లర్ మూవీ “నిశ్శబ్ధం” తో ప్రేక్షకులను అలరించనున్నారు.

ఎప్పుడూ నవ్వుతూ, హుషారుగా ఉండే కోన వెంకట్ ఒక తాజా ఇంటర్వ్యూ లో ఒక షాకింగ్ న్యూస్ వెల్లడించారు. కోన మాట్లాడుతూ … ఒకానొక టైమ్ లో పిల్లలకు స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితి, కుటుంబం తో ఒక చిన్న రూమ్ లో ఉండాల్సిన పరిస్థితి లో 50 నిద్ర మాత్రలు వేసుకుని ఆత్మ హత్య చేసుకోవాలనుకున్నానని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఇది ఎవరికీ తెలియని నిజం, కోనవెంకట్ స్వయంగా వెల్లడించారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 12 =