“సాహో రే” ప్రభాస్

Young Rebel Star Prabhas Donates 4 Crore Rupees For COVID-19 Relief

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే ఇండియా లో తన ప్రతాపం చూపుతుంది. కరోనా వైరస్ కారణంగా ప్రజల దైనందిక కార్యక్రమాలపై ఎఫెక్ట్ పడింది. ప్రాణాలు హరిస్తున్న కరోనా కారణం గా జన జీవనం అల్లకల్లోలమయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలతో ప్రజలు అప్రమత్తం తో ప్రజలు ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. కరోనా కట్టడి కై కేంద్ర, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విశేషంగా కృషి చేస్తున్నాయి. మార్చి 22 వ తేదీ కర్ఫ్యూ ప్రకటించిన ప్రధాని మోదీ ప్రజా శ్రేయస్సు కై 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు.

పేద, మధ్య తరగతి ప్రజానీకాన్ని ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం 1,70,000కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అదే విధం గా కరోనా వైరస్ కట్టడికై సినీ ప్రముఖులు చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, నితిన్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తమ వంతు సాయంగా ప్రధాన మంత్రి, ముఖ్య మంత్రి సహాయ నిధులకు విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. హీరో రాజ శేఖర్, అల్లరి నరేష్ వంటివారు పేద సినీ కళాకారులు , కార్మికులకు చేయూత నిస్తున్నారు. ఇప్పుడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కరోనా కట్టడికై పి ఎమ్ రిలీఫ్ ఫండ్ కు 3కోట్లు, తెలుగు రాష్ట్రాల సి ఎమ్ రిలీఫ్ ఫండ్స్ కు ఒక కోటి విరాళం ప్రకటించారు. టోటల్ గా 4కోట్లు విరాళం ప్రకటించి బాహుబలి “సాహో రే” ప్రభాస్ అనిపించుకున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here