మెగాస్టార్ చిరంజీవి నటనావైభవానికి ప్రతీకగా నిలిచిన చిత్రాలలో `ఆరాధన` ఒకటి. చిరంజీవిలోని నటుణ్ణి మరో స్థాయికి తీసుకువెళ్ళిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో సుహాసిని, రాధిక కథానాయికలుగా నటించారు. రాజశేఖర్, పి.యల్.నారాయణ, ప్రసాద్, కృష్ణమూర్తి, జానకి, అనూరాధ వాసుదేవ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తమిళ చిత్రం `కడలోర కవితైగళ్` ఆధారంగా ‘ఆరాధన’ను రూపొందించారు దర్శకుడు భారతీరాజా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆచార్య ఆత్రేయ, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి గీత రచన చేయగా… మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా వినసొంపైన బాణీలు అందించారు. ముఖ్యంగా “అరె ఏమైందీ”, “తీగనై”… వంటి గీతాలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంటాయి. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం… చిరు తనయుడు, మెగాపవర్ స్టార్ రామ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కావడం విశేషం. 1987 మార్చి 27న విడుదలైన `ఆరాధన`… నేటితో 33 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: