రామరాజు కోసం భీమ్ సర్ ప్రైజ్ వీడియో

RRR Movie Team To Surprise Fans

మొత్తానికి ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ఆర్ఆర్ఆర్ టీమ్ ఎలాంటి హడావుడి లేకుండా ఇప్పుడు వరుస పెట్టి సర్ ప్రయిజ్ లు ఇస్తుంది. నిన్న ఉగాది పండుగకు టైటిల్ ను ప్రకటించి అందరికీ షాకిచ్చారు. ఆ ఎప్పటినుండో వింటున్నాం.. ఇప్పుడు మాత్రం ఏం రిలీజ్ చేస్తారో అనుకున్నారు అందరు. కానీ అందరికీ షాకిస్తూ టైటిల్ ను రిలీజ్ చేశారు. ఇక రేపు మరో సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. రేపు చరణ్ పుట్టిన రోజు కావడంతో జూనియర్ రామ్ చరణ్ కు స్పెషల్ వీడియోతో సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడు. అంతే కాదు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. రేపు ఉదయం 10 గంటలకు రామ్ చరణ్ స్పెషల్ వీడియోను జూనియర్ ఎన్టీఆర్ లాంచ్ చేస్తున్నాడు. చూద్దాం మరి ఆ వీడియో ఎలా ఉండబోతుందో..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు.

ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 2 =