యంగ్ టైగర్ యన్టీఆర్, మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ (2016) చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో తారక్‌కు పెదనాన్నగా మోహన్ లాల్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలచింది. అంతేకాదు.. ఆ చిత్రంలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. అలాగే సెంటిమెంట్ సీన్స్ కూడా కంటతడి పెట్టించాయి. కట్ చేస్తే.. మరోసారి ఇలానే కుటుంబ బంధం ఉన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారట తారక్, లాల్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



ఆ వివరాల్లోకి వెళితే… దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న మల్టీస్టారర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్`(రౌద్రం రణం రుధిరం)లో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కొమరం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ దర్శనమివ్వనున్న ఈ సినిమాలో.. కొమరం భీమ్ బాబాయ్ పాత్రలో మోహన్ లాల్ నటించనున్నారట. కొమరం భీమ్ లో స్ఫూర్తిని నింపే ఈ పాత్రలో మోహన్ లాల్ అయితే బాగుంటుందని యూనిట్ భావిస్తోందట. అలాగే తారక్, లాల్ మధ్య సాగే సెంటిమెంట్ సీన్స్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయని టాక్. మరి, ‘జనతా గ్యారేజ్’లో తారక్‌కు పెదనాన్నగా నటించి మెప్పించిన మోహన్ లాల్.. బాబాయ్ పాత్రలోనూ అలరిస్తారేమో చూడాలి. ఏదేమైనా మోహన్ లాల్ ఎంట్రీపై క్లారిటీ రావాల్సి ఉంది.
కాగా, 2021 జనవరి 8న `ఆర్ ఆర్ ఆర్` ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: