మరో ప్ర‌యోగాత్మక పాత్ర‌లో బాలకృష్ణ?

Nandamuri Balakrishna To Play A Versatile Role For His Upcoming Movie

నటసింహ నందమూరి బాలకృష్ణ అంటేనే పవర్ ఫుల్ డైలాగ్స్ కి కేరాఫ్ అడ్రస్. ‘సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ, సింహా, లెజెండ్’… ఇలా పలు బ్లాక్ బస్టర్స్ లో బాలయ్య పలికిన సంభాషణలు ఆయా చిత్రాలకు ప్రధాన బలంగా నిలిచాయి. అలాంటి బాలయ్య… తొలిసారి డైలాగ్స్ లేని ఓ ప్ర‌యోగాత్మక పాత్రలో నటించబోతున్నారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే.. బాల‌కృష్ణ‌, యాక్ష‌న్ మూవీస్ స్పెష‌లిస్ట్ బోయపాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ డివోష‌నల్ డ్రామా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. వార‌ణాసి నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో బాల‌య్య రెండు విభిన్న పాత్ర‌ల్లో కనిపించ‌నున్నారు. వాటిలో ఒక‌టి అఘోరా పాత్ర కాగా.. మ‌రొక‌టి రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిస్ట్ క్యారెక్ట‌ర్. కాగా, ఇందులో అఘోర పాత్రకు సంబంధించి బాల‌య్య‌ ఒక్క మాట పలకడంగాని, ఫైట్ చేయడం గాని చేయ‌ర‌ట‌. అంటే, ఒక విధంగా క‌ళ్ళ‌తోనే హావ‌భావాలు ప‌లికించే పాత్ర‌న్న మాట‌. మ‌రి, పంచ్ డైలాగ్స్‌కి, మాస్ ఫైట్స్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిల‌చే బాల‌య్య.. ఇప్పుడీ కొత్త తరహా ప్ర‌యోగంతో అభిమానులను ఏ మేరకు అలరిస్తారో చూడాలి. త్వర‌లోనే ఈ ఎక్స్‌పెరిమెంట‌ల్ రోల్‌కి సంబంధించి మ‌రింత క్లారిటీ వచ్చే అవ‌కాశం ఉంది.

మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్టు స‌మాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + five =