నితిన్ కి విలన్‌గా రమ్యకృష్ణ ?

Ramya Krishna To Play Baddie In Nithiin's Movie

ఎలాంటి హావభావాన్నైనా అల‌వోక‌గా పలికించగలిగే అతి కొద్దిమంది న‌టీమ‌ణుల్లో సీనియ‌ర్ యాక్ట్ర‌స్ రమ్యకృష్ణ ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ట‌ర్న్ అయ్యాక కూడా తన సత్తా చాటుతున్న ఈ మాజీ క‌థానాయిక‌.. ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ లో ముఖ్య భూమిక‌లు పోషిస్తోంది. మ‌రీ ముఖ్యంగా `బాహుబ‌లి` సిరీస్ త‌రువాత ర‌మ్య‌కృష్ణ ధ‌రించే పాత్ర‌ల‌పై అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ ఛాలెంజింగ్ రోల్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట ర‌మ్య‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. హిందీనాట‌ కాసుల వర్షం కురిపించిన ‘అంధాధున్‌’ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నితిన్ హీరోగా రూపొందుతున్న‌ ఈ చిత్రంలో.. రమ్య విలన్‌గా నటించనుందట. హిందీలో టబు పోషించిన ఈ పాత్రకి రమ్య‌కృష్ణ అయితే బాగుంటుంద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆమెతో సంప్ర‌దింపులు కూడా జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే ర‌మ్య‌కృష్ణ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

మ‌రి… ప‌ద‌హారేళ్ళ క్రితం ‘శ్రీ ఆంజనేయం’(2004)లో నితిన్ కి అమ్మ‌గా న‌టించిన ర‌మ్య‌.. ఇప్పుడు విల‌న్ రోల్ లో ఏ మేర‌కు మెస్మ‌రైజ్ చేస్తుందో చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here