విభిన్న కథా చిత్ర దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా పాన్ ఇండియా మూవీ “పుష్ప ” రూపొందుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో “పుష్ప ” మూవీ రూపొందుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఈ రోజు రెండు పోస్టర్స్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అల్లు అర్జున్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్న “పుష్ప” మూవీ తెలుగు తో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. అల్లు అర్జున్ సినీకెరీర్ లో ఐదు భాషలలో రిలీజ్ కానున్న మొదటి చిత్రం “పుష్ప . సూపర్ హిట్ మూవీస్ “ఆర్య” , “ఆర్య2” మూవీస్ తరువాత సుకుమార్, అల్లు అర్జున్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో “పుష్ప ” మూవీ తెరకెక్కుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: