ఏఎన్నార్, నాగార్జున ‘క‌లెక్ట‌ర్ గారి అబ్బాయి’కి 33 ఏళ్ళు

ANR And Akkineni Nagarjuna Multistarrer Movie Collector Gari Abbai Completes 33 Years

మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, ఆయన తనయుడు ‘కింగ్’ నాగార్జున క‌ల‌యిక‌లో వ‌చ్చిన ప‌లు చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. అలా వారి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఫ‌స్ట్ మూవీ ‘క‌లెక్ట‌ర్ గారి అబ్బాయి’. అగ్ర ద‌ర్శ‌కుడు బి.గోపాల్ రూపొందించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో.. నాగ్‌కు జోడిగా రజిని న‌టించింది. ఇతర ముఖ్య పాత్రలను ‘ఊర్వ‌శి’ శార‌ద‌, నూత‌న్ ప్రసాద్, కోట శ్రీ‌నివాస‌రావు, సుధాక‌ర్, సుత్తివేలు, ‘శుభ‌లేఖ’ సుధాక‌ర్, పి.ఎల్.నారాయ‌ణ‌, న‌ర్రా వెంక‌టేశ్వ‌ర‌రావు, శ్రీ‌ల‌క్ష్మి, ర‌మాప్ర‌భ తదితరులు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దిగ్గ‌జ ర‌చ‌యిత వేటూరి సుంద‌ర‌రామ‌మూర్తి గీత ర‌చ‌న చేయ‌గా.. చ‌క్ర‌వ‌ర్తి స్వ‌ర‌క‌ల్ప‌న‌లో రూపొందిన పాట‌లు అల‌రించాయి. వాటిలో “న‌చ్చిన చోట‌”, “అంద‌మా అంటుకోనీవే”, “మన్మథ మన్మథ”, “బంగారు లేడిని కోరిన‌”, “స‌న్నాయి ఆప‌కు బావ”.. వంటి పాట‌లు అప్ప‌ట్లో జ‌నాద‌ర‌ణ పొందాయి. ఏఎన్నార్ స‌మ‌ర్ప‌ణ‌లో అన్న‌పూర్ణ స్టూడియోస్ ప‌తాకంపై యార్ల‌గ‌డ్డ సురేంద్ర నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మంచి విజ‌యం సాధించింది. 1987 ఏప్రిల్ 9న విడుద‌లై ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన ‘క‌లెక్ట‌ర్ గారి అబ్బాయి’.. నేటితో 33 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 4 =