నేను ఖాళీగా లేను.. వాళ్ళే ఖాళీగా ఉన్నట్టున్నారు..!

Actress Tamannaah Condemns Rumours On Her Film Career With A Strong Reply
Actress Tamannaah Condemns Rumours On Her Film Career With A Strong Reply

సెలెబ్రిటీలపై సోషల్ మీడియాలో ఏదో ఒక రూమర్.. ఏదో ఒక కామెంట్ రావడం కామన్ థింగ్. ఇక ఈ కామెంట్స్ ను కొంత మంది లైట్ తీసుకుంటే.. కొంతమంది మాత్రం సీరియస్ తీసుకుంటారు. ఇక ఇప్పుడు మరోసారి ఈ కామెంట్స్ పై సీరియస్ అయింది తమన్నా. అసలు సంగతేంటంటే…తమన్నాకు అవకాశాలు తక్కువ అయ్యాయని…ఖాళీగా ఉందన్న కామెంట్స్ పడ్డాయి. ఇక వీటిపై స్పందించిన తమన్నా…”365 రోజులు నేను బిజీగానే వున్నాను .. వరుసగా ప్రాజెక్టులు వస్తూనే వున్నాయి. నాకు నచ్చిన పాత్రలను నేను ఎంచుకుంటూనే వున్నాను. ప్రస్తుతం నేను చేస్తున్న ‘సీటీమార్’ షూటింగు దశలో వుంది. ఈ సినిమాలోని పాత్ర కోసం నేను కబడ్డీ నేర్చుకున్నాను. నా ప్లానింగ్ ప్రకారం నేను ముందుకు వెళుతున్నాను. నేను ఖాళీగా వున్నానని ప్రచారం చేసేవారే ఖాళీగా వున్నారని నాకు అర్థమవుతోంది” అని కాస్త సీరియస్ గానే కౌంటర్ ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం తమన్నా…సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సీటీమార్” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − eight =