వినోదాత్మక చిత్రాలకు చిరునామాగా నిలుస్తున్నాడు యువ దర్శకుడు అనిల్ రావిపూడి. మొదటి సినిమా ‘పటాస్’ నుండి రీసెంట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. కాగా, కెరీర్‌లోనే తొలిసారి తన దర్శకత్వంలోనే రూపొందిన ఓ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్‌ని ప్లాన్ చేసే పనిలో ఉన్నాడట ఈ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాస్త ఆ వివరాల్లోకి వెళితే.. 2019 సంక్రాంతికి వచ్చిన హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘ఎఫ్ 2’కి కొనసాగింపుగా త్వరలో ‘ఎఫ్ 3’ని రూపొందించనున్నాడట అనిల్. ‘ఎఫ్ 2’లో కొత్త జంటల మధ్య తలెత్తే చిన్న చిన్న గిల్లికజ్జాలను వినోదాత్మకంగా చూపించిన అనిల్.. సీక్వెల్ కోసం లాక్ డౌన్ బ్యాక్ డ్రాప్‌ను ఎంచుకున్నట్టు సమాచారం. అంటే.. లాక్ డౌన్ కారణంగా భార్యాభర్తలు ఇంట్లో ఎక్కువ సమయం గడపడంతో వారిద్దరి మధ్య వచ్చే చిన్న చిన్న తగాదాలను తనదైన శైలిలో చూపించబోతున్నాడట. మరి తనదైన బాణిలో వినోదాన్ని పండించే అనిల్.. ‘ఎఫ్ 3’తో ఎటువంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
ఇదిలా ఉంటే.. ‘ఎఫ్ 2’లో కథానాయకులుగా నటించిన విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ఈ సీక్వెల్‌లో కూడా దర్శనమివ్వనున్నట్టు వినికిడి. అంతేకాదు.. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో మరో కథానాయకుడు కూడా జాయిన్ అవుతాడని కథనాలు వినిపిస్తున్నాయి. జూలై నుంచి పట్టాలెక్కనున్న ఈ సీక్వెల్.. 2021 సంక్రాంతికి జనం ముందుకు రానున్నట్టు ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విషయాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: