ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్‘ చిత్రం.. బాక్సాఫీస్ ముంగిట ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ముఖ్యంగా “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ సంగీతం సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. ఇక పాటల విషయానికొస్తే.. “దిమాక్ ఖరాబ్” యువతను అమితంగా ఆకట్టుకుంది. రామ్, నభా నటేష్, నిధి అగర్వాల్ బృందంపై చిత్రీకరించిన ఈ ఊరమాస్ సాంగ్.. థియేటర్లలో ప్రేక్షకుల చేత స్టెప్పులు వేయించింది. కేవలం థియేటర్లలోనే కాదు యూట్యూబ్‌లోనూ ఈ గీతం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గత ఏడాది సెప్టెంబర్ 20న ఈ పాటని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా.. తాజాగా 100 మిలియన్ల (10 కోట్లు) వ్యూస్‌ని క్రాస్ చేసింది. మణిశర్మ సంగీతం, కాసర్ల శ్యామ్ సాహిత్యం, కీర్తన శర్మ- సాకేత్ గానం, రాజ్ తోట సినిమాటోగ్రఫీ, శేఖర్ మాస్టర్ నృత్యదర్శకత్వం.. అన్నింటికి మించి రామ్ ఎనర్జిటిక్ స్టెప్స్, నిధి – నభా గ్లామర్.. వెరసి “దిమాక్ ఖరాబ్”కి ఈ స్థాయి విజయాన్ని కట్టబెట్టాయి.
మున్ముందు.. “దిమాక్ ఖరాబ్” ఖాతాలో ఇంకెన్ని వ్యూస్ చేరతాయో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: