గత కొంతకాలంగా రీమేక్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది టాలెంటెడ్ బ్యూటీ సమంత. మరీ ముఖ్యంగా.. నాయికా ప్రాధాన్యమున్న రీమేక్స్‌ను ఎంచుకుంటూ వార్తల్లో నిలుస్తోంది.`యూటర్న్`, `ఓ బేబీ`, ‘జాను’.. ఈ కోవకు చెందిన సినిమాలే. కట్ చేస్తే.. తాజాగా మరో ఫీమేల్ సెంట్రిక్ రీమేక్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట సామ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ఈ ఏడాది ఫిబ్రవరి 7న విడుదలైన కన్నడ చిత్రం ‘దియా’.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఏ విషయాన్నైనా తనలోనే దాచుకుని మదనపడే ఓ అమ్మాయి కథగా ‘దియా’ తెరకెక్కింది. ఇప్పుడు ఆ చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. టైటిల్ రోల్‌లో సమంత నటించే అవకాశముందని కొంతమంది అంటుండగా.. మరి కొంతమంది సామ్ కేవలం నిర్మాణ బాధ్యతలు మాత్రమే స్వీకరించే అవకాశముందని చెబుతున్నారు.




మరి.. ‘దియా’ రీమేక్ విషయంలో సామ్ ఏ వైపు మొగ్గు చూపుతుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























