బ్లాక్ బస్టర్ “సరిలేరు నీకెవ్వరు” మూవీ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, బ్లాక్ బస్టర్ “గీత గోవిందం”మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందే మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ హీరోయిన్ గా కీర్తి సురేష్, కియారా అద్వానీ , మరికొంతమంది కథానాయిక ల పేర్లు వినిపించాయి. ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పేరు తెర పైకి వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




“ఆషికీ 2” , “ఏక్ విలన్”, “బాఘీ”,” స్త్రీ” , “చిచ్చోరే ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న శ్రద్ధా కపూర్ ను మహేష్ బాబు కు జోడీ గా ఎంపిక చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో జంటగా శ్రద్ధా కపూర్ “సాహో ” మూవీ లో నటించిన విషయం తెలిసిందే. మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా శ్రద్ధాకపూర్ ను సంప్రదిస్తున్నట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























