నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్లో పలు మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. వాటిలో ‘సీతారామకళ్యాణం’ ఒకటి. “హాస్యబ్రహ్మ” జంధ్యాల రూపొందించిన ఈ చిత్రంలో రజిని కథానాయికగా నటించగా.. జగ్గయ్య, గొల్లపూడి మారుతీరావు, రమాప్రభ, రామకృష్ణ, రాజేష్, శ్రీధర్, సంగీత, ముచ్చర్ల అరుణ, సుత్తివేలు, ‘శుభలేఖ’ సుధాకర్ ముఖ్య భూమికలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మ్యూజికల్ బ్లాక్ బస్టర్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ‘యువ చిత్ర ఆర్ట్స్’ అధినేత కాట్రగడ్డ మురారి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి సుందరరామమూర్తి గీత రచనకు.. దిగ్గజ స్వరకర్త కె.వి.మహదేవన్ స్వరాలు సమకూర్చారు. “రాళ్ళల్లో ఇసకల్లో”, “కళ్యాణ వైభోగమే”, “ఎంత నేర్చినా”, “వీళ్ళు వాళ్ళు”, “సరిగమపదని”, “ఏమని పాడను”.. ఇలా ప్రతీ పాట అజరామరంగా నిలిచిపోయింది. 1986 ఏప్రిల్ 18న విడుదలై ఘనవిజయం సాధించిన ‘సీతారామకళ్యాణం’.. నేటితో 34 వసంతాలను పూర్తి చేసుకుని 35వ పడిలోకి అడుగుపెడుతోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























