మెగాస్టార్ చిరంజీవి ‘చిరంజీవి’కి 35 ఏళ్ళు

Mega Star Chiranjeevi's Emotional Family Entertainer Chiranjeevi Completes 35 Years

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఫాదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. వాటిలో ‘చిరంజీవి’ ఒకటి. “తల్లి లేని కొడుకుని ప్రేమతో పెంచిన తండ్రి.. ఆ తండ్రి కోసం ప్రాణం ఇచ్చే కొడుకు”.. అలాంటి తండ్రీకొడుకుల మధ్య అనుకోని అవాంతరాలు ఎదురైతే ఎలా ఉంటుంది? అన్న కథాంశంతో తెరకెక్కిన సినిమానే ‘చిరంజీవి’. విజయశాంతి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో.. కైకాల సత్యనారాయణ, భానుప్రియ, మురళీమోహన్, నూతన్ ప్రసాద్, రంగనాథ్, అన్నపూర్ణ ముఖ్య పాత్రలు పోషించారు. కన్నడ మూవీ ‘నానే రాజా’కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు సి.వి.రాజేంద్రన్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేటూరి సుందరరామమూర్తి గీత రచన చేయగా.. చక్రవర్తి స్వరకల్పన చేసారు. కైకాల సత్యనారాయణ సమర్పణలో అజయ్ క్రియేషన్స్ పతాకంపై కె.లక్ష్మీనారాయణ, కె.వి.రామారావు సంయుక్తంగా నిర్మించారు. 1985 ఏప్రిల్ 18న విడుదలైన ‘చిరంజీవి’.. నేటితో 35 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =