దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి సూపర్ హిట్ “అష్టా చెమ్మా” మూవీ తో నాని ని టాలీవుడ్ కు హీరోగా పరిచయం చేశారు. వారిద్దరి కాంబినేషన్ లో రూపొందిన “జెంటిల్ మన్ ” మూవీ ఘనవిజయం సాధించింది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన హీరో నాని సిల్వర్ జూబ్లీ మూవీ యాక్షన్ థ్రిల్లర్ “V” కరోనా కారణం గా విడుదల వాయిదా పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి బర్త్ డే సందర్భంగా ఈ రోజు హీరో నానిఆయనకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. తన 25 వ సినిమా ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిందని, తన 50వ సినిమా కూడా ఆయన దర్శకత్వంలోనే రూపొందాలని కోరుకుంటున్నానని, ఇంద్రగంటి 25 వ సినిమాలో నటించాలనుకుంటున్నానని నాని తెలిపారు. హీరో నాని ప్రస్తుతం “టక్ జగదీష్ ” మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ దర్శకత్వంలో “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ లో నటించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























