కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం కలవరపడుతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కట్టడికై ప్రపంచమంతా లాక్ డౌన్ పాటిస్తుంది. భారతదేశం లో కరోనా వ్యాప్తి నివారణకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర కృషి చేస్తున్నాయి. కరోనా మహమ్మారి పోరులో వైద్య బృందాలు, పోలీస్ శాఖ, పారిశుధ్య సిబ్బంది అహర్నిశలూ శ్రమిస్తున్నారు. సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాత దిల్ రాజు కరోనా పై పోలీస్ యుద్ధం నేపథ్యం లో ఒక మూవీ ని నిర్మిస్తానని తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మాస్క్ లు, శానిటైజర్స్ ను దిల్ రాజు నిన్న పోలీస్ సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ .. కరోనా కారణంగా లాక్ డౌన్ తో ప్రజలంతా ఇళ్ళకే పరిమితం అయిన సమయంలో రాత్రనక, పగలనక సేవలందిస్తున్న డాక్టర్స్, పోలీస్, పారిశుధ్య సిబ్బంది కి అభినందనలు అని, పోలీస్ ల గొప్పతనాన్ని వివరిస్తూ ఒక మూవీ నిర్మించాలనే కోరిక ఎప్పటినుంచో ఉందని, ఇప్పుడు పోలీస్ శాఖఅందిస్తున్న సేవలతో ఆ కోరిక మరింత పెరిగిందని, త్వరలోనే మూవీ నిర్మిస్తానని దిల్ రాజు తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: