‘ఆచార్య’ లో అవసరమైతే నేనుంటా అన్నారు..!

‘ఆచార్య’ లో మహేష్ బాబు.. గతకొద్ది కాలంగా పలు సైట్లలో నడుస్తున్న న్యూస్ ఇది. ఒకపక్క దీనిపై క్లారిటీ ఇస్తూనే ఉన్నా మరోపక్క ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే చిరు అసలు మహేష్ పేరు ఎలా వచ్చిందో తెలియట్లేదు… ఈ సినిమాలో ఓ పాత్రకు చరణ్ అయితే బావుంటదని కొరటాల శివకు మొదటినుండి ఉంది.. అయితే చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తో బిజీ గా వున్నాడు.. ఈ సినిమా కోసం డేట్స్ ఇవ్వడంపై మొదటి నుండి అనుమానం ఉంది…రాజమౌళి, కొరటాల ఒక అండర్ స్టాండింగ్ కు వస్తే… ఈ సినిమాలో చరణ్ ఉండొచ్చు అని ముందే చెప్పాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా మరోసారి ఈ విషయం పై కొరటాల కూడా స్పందించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. నిజానికి ఈ సినిమాలో మొదటినుండి రామ్ చరణ్ నే అనుకుంటున్నాం అయితే ఆర్ఆర్ఆర్ వాయిదా వల్ల ఆచార్య కు డేట్స్ ఇస్తాడో…లేదో అన్నది డౌట్ గా ఉంది. దానితో నాకు టెన్షన్ మొదలైంది. అదే టైం లో మహేష్ తో మాట్లాడాను. ఈ విషయం మొత్తం చెప్పాను. అందుకు ఆయన సరే నువ్వేం టెన్షన్ పడకు.. అవసరమైతే నేనుంటాను అనిచెప్పారు. ఆయన అలా చెప్పగానే నేను షాకయ్యను. అంత పెద్ద హీరో అలా స్పందించడంతో నేను ఆ విషయాన్ని కొందరితో పంచుకున్నాను. అది కాస్తా మహేష్ ఆచార్యలో నటిస్తున్నాడంటూ ప్రచారం జరిగింది” అని కొరటాల అసలు విషయం చెప్పుకొచ్చారు. మరి చూద్దాం ఎవరుంటారో..?

కాగా ప్రస్తుతం చిరు, కొరటాల దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జోడి జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ .. త్వ‌ర‌లోనే త‌దుప‌రి షెడ్యూల్ ప్రారంభించ‌నుంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.