తేజ దర్శకత్వంలో నితిన్, సదా జంటగా నటించిన ‘జయం’ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తేజ డైరెక్షన్‌లో ఆర్పీ పట్నాయక్ సంగీతంతో అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్‌ను కుదిపేసింది. ఈ సినిమా తేజ, నితిన్, సదా, ఆర్పీకి వరుస అవకాశాలు వచ్చేలా చేసింది. ఇక హిట్ అయిన సినిమాను రీమేక్ చేయడం తెలిసిన సంగతే కదా. ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో తమిళంలో రీమేక్ చేశారు. తమిళంలో రవి, సదా జంటగా నటించారు. అక్కడ కూడా సినిమా సూపర్ హిట్టే. ఆ సినిమాతో రవి కాస్త జయం రవిగా ముద్ర పడిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా వచ్చి 18 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఈ సినిమాను రీమేక్ చేయాలనీ చూస్తున్నారు. ఇక్కడ కాదులెండి. కన్నడలో ఈ సినిమాను రీమేక్ చేయాలనే యోచనలో ఉన్నారట. కన్నడ నాట ప్రవీణ్ కుమార్ అనే డాక్టర్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్రవీణ్ అనే కుర్ర నటుడు ‘జయం’ సినిమాను కన్నడలో రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. ప్రవీణ్ ఓ డాక్టర్. కానీ యాక్టింగ్ అంటే ప్రాణం. అందుకే దాదాపు ఏడాది పాటు నటనలో శిక్షణ తీసుకుని ‘జయం’ రీమేక్‌తో కన్నడ చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అవ్వాలని నిర్ణయించుకున్నాడు. త్వరలో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట.




మరి ఈ 18 ఏళ్ళలో ఎన్నో మార్పులు జరిగాయి. అలాంటిది ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత ఈ సినిమాను రీమేక్ అంటే.. చూద్దాం ఈ తరానికి తగ్గట్టు ఏమన్నా మార్పులు చేస్తారేమో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























