వెంక‌టేష్ ‘ఆడవారిమాటలకు… అర్థాలేవేరులే!’కి 13 ఏళ్ళు

Victory Venkatesh Wholesome Family Entertainer Aadavari Matalaku Arthale Verule Completes 13 Years, Latest Telugu Movie News, Latest Tollywood News, Telugu Film News 2020, Tollywood Movie Updates, Telugu Filmnagar, Aadavari Matalaku Arthale Verule Movie Completes 13 Years, Aadavari Matalaku Arthale Verule Telugu Movie, Venkatesh AMAV Movie Completes 13 Years, Victory Venkatesh, Venkatesh Latest News 2020, AMAV Telugu Movie

కుటుంబ క‌థా చిత్రాల‌కు చిరునామాగా నిలచిన క‌థానాయ‌కుల్లో విక్టరీ వెంకటేష్‌ ఒకరు. ఆయ‌న న‌టించిన ప‌లు ఫ్యామిలీ డ్రామాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. వాటిలో ‘ఆడవారిమాటలకు… అర్థాలేవేరులే!’ ఒకటి. ఇందులో వెంకీ సరసన త్రిష కథానాయికగా న‌టించ‌గా… కోట శ్రీనివాస రావు, శ్రీరామ్, కె.విశ్వనాథ్, సునీల్, జీవా, ‘క‌ల‌ర్స్‌’ స్వాతి, రాజ్యలక్ష్మి, ప్రసాద్ బాబు ముఖ్య భూమికలు పోషించారు. మేఘ‌నా నాయుడు, ముమైత్ ఖాన్ ప్ర‌త్యేక గీతాల్లో మెరిశారు. శ్రీరాఘవ (సెల్వరాఘవన్) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్రసాద్, ఎస్.నాగ అశోక్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యువన్ శంకర్ రాజా స్వరకల్పనలో రూపుదిద్దుకున్న పాటలన్నీ చార్ట్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. “నా మ‌న‌సుకు ప్రాణం”, “ఏమైంది ఈ వేళ‌”, “అల్లంత దూరాన‌”, “ఓ బేబి”, “చెలి చెమ‌కుచెమ‌కు”, “మ‌న‌సా మ‌న్నించ‌మ్మా”.. ఇలా అన్ని పాట‌లు యువ‌తరాన్ని ఉర్రూత‌లూగించాయి. కాగా, ఈ సినిమాతో ఉత్తమ నటిగా త్రిష ఫిలింఫేర్‌ను సొంతం చేసుకోగా… ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు (వెంకటేష్), ఉత్తమ మాటల రచయితలు(రమేష్, గోపి) విభాగాల‌లో నంది అవార్డులు వ‌రించాయి. తమిళం(‘యారడి నీ మోహిని’), క‌న్న‌డం(‘అందు ఇందు ప్రీతి బందు’), బెంగాలీ(‘100%లవ్’), భోజ్‌పురి(‘మెహంది లగాకే రఖ్నా’), ఒడియా(‘ప్రేమ అదై అక్ష్యరా’) ఇలా ప‌లు భాషల్లో ఈ సినిమా రీమేక్ అయింది. 2007 ఏప్రిల్ 27న విడుదలైన ఈ చిత్రం… నేటితో 13 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =