పవన్ కళ్యాణ్ ‘ఖుషి’కి 19 ఏళ్ళు

Power Star Pawan Kalyan Sensational Hit Movie Kushi Turns 19

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌గా నిలిచిన చిత్రం ‘ఖుషి’. కథానాయకుడిగా వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న పవన్ స్థాయిని అమాంతం పెంచిన సినిమా ఇది. ఆబాల‌గోపాలాన్ని అలరించిన ఈ చిత్రంలో పవన్‌కు జోడిగా భూమికా చావ్లా నటించింది. శివాజీ, నాజర్, విజయ్ కుమార్, సుధ, అలీ, రాజన్ పి.దేవ్, ముంతాజ్, జానకి సబేష్, అజయ్ ముఖ్య భూమికలు పోషించారు. టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్.జె.సూర్య ఈ మూవీని తెరకెక్కించ‌డ‌మే కాకుండా.. క‌థ‌ను మ‌లుపుతిప్పే పాత్ర‌లోనూ దర్శనమిచ్చాడు. తమిళ చిత్రం ‘ఖుషి’కి రీమేక్‌గా రూపొందిన ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ప్ర‌ముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చంద్రబోస్, సుద్దాల అశోక్‌తేజ, ఎ.ఎం.రత్నం, అబ్బాస్ టైర్‌వాలా గీత రచన చేయ‌గా.. “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ చార్ట్ బస్టర్ సాంగ్స్‌ను అందించారు. “అమ్మాయే సన్నగా”, “చెలియ చెలియా”, “ప్రేమంటే సులువు కాదురా”, “ఆడువారి మాటలకు అర్థాలే వేరులే” (పింగళి రచన – ‘మిస్సమ్మ’లోని పాటకు రీమిక్స్), “హోలీ హోలీ”, “ఏ మేరా జహాన్”.. ఇలా ప్రతీ పాట ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించింది. 2001 ఏప్రిల్ 27న విడుదలై ఘనవిజయం సాధించిన ‘ఖుషి’.. నేటితో 19 వసంతాలను పూర్తిచేసుకుని 20వ ప‌డిలోకి అడుగుపెడుతోంది.

కాగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ద్వారా వీక్షించగలరు.👇

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − five =