“రౌడీ” తో నటించాలని ఉంది – పాయల్ రాజ్ పుత్

RX 100 Fame Actress Payal Rajput Wishes To Act With Vijay Deverakonda

మరాఠీ సూపర్ హిట్ “సైరాత్ ” మూవీ పంజాబీ రీమేక్ “చెన్న మేరియా “మూవీ తో సినీకెరీర్ ప్రారంభించిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ సెన్సేషనల్ హిట్ “RX 100” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పాయల్ తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్నారు. “వెంకీ మామ “, డిస్కో రాజా ” మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన పాయల్ ప్రస్తుతం ఒక తెలుగు మూవీ లో నటిస్తున్నారు. “ఏంజెల్ ” తమిళ మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ పీరియడ్ లో ఇంటికి పరిమితం అయిన పాయల్ ఇన్ స్టా గ్రామ్ లైవ్ లో అభిమానులతో ముచ్చటించారు. టాలీవుడ్ హీరోలలో ఎవరితో నటించాలనుకుంటున్నారు అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకి “విజయ్ దేవరకొండ ” అంటూ పాయల్ బదులిచ్చారు. “RX 100” మూవీ హీరో కార్తికేయ తో డేటింగ్ చేయాలనుకుంటున్నారా అనే ప్రశ్నకి మేమిద్దరం మంచి స్నేహితులం, అది చాలు అంటూ పాయల్ చెప్పారు. విజయ్ దేవరకొండ తో జంటగా నటించాలనే పాయల్ కోరిక త్వరలో నెరవేరాలని కోరుకుందాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.