2013లో విడుదలైన ‘ఉయ్యాలా జంపాలా’తో నాయకానాయికలుగా తొలి అడుగులేశారు రాజ్ తరుణ్, అవికా గోర్. మొదటి సినిమాతోనే ఈ జంట బ్లాక్ బస్టర్ హిట్‌ని తమ ఖాతాలో వేసుకుంది. ఆపై మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘సినిమా చూపిస్త మావ’(2015)తో మరో ఘనవిజయాన్ని నమోదు చేసుకున్నారు. కట్ చేస్తే.. ఐదేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం ఈ హిట్ పెయిర్ ముచ్చటగా మూడోసారి జట్టుకట్టేందుకు సిద్దమవుతోందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ (2016) ఫేమ్ శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో ఓ రొమాంటిక్ కామెడీ తెరకెక్కనుంది. ఇందులోనే రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా నటించబోతున్నారని వినికిడి. మరి.. ‘ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్త మావ’తో మరపురాని విజయాలను అందుకున్న రాజ్ తరుణ్, అవికా గోర్ జంట.. రాబోయే చిత్రంతో హ్యాట్రిక్ హిట్‌ని నమోదు చేసుకుంటుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: