సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవి తేజ, శృతి హాసన్ జంటగా యాక్షన్ థ్రిల్లర్ “క్రాక్” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నిజ జీవిత సంఘటనలతో రూపొందుతున్న ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర ఖని, అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. ఈ మూవీ లో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు గోపీచంద్ , హీరో రవితేజ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా “క్రాక్ ” రూపొందుతుంది. కటారి పాత్రలో నటిస్తున్న సముద్ర ఖని ఫస్ట్ లుక్ ను ఆయన బర్త్ డే (26 వ తేదీ )రోజున చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. లాక్ డౌన్ తరువాత జరిగే షూటింగ్ షెడ్యూల్ తో “క్రాక్” మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది. నటుడు, దర్శకుడు సముద్ర ఖని ఈ మూవీ తో పాటు “రౌద్రం రణం రుధిరం ” మూవీ లో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: