‘యమలీల’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత అలీ హీరోగా ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మరో సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘ఘటోత్కచుడు’. కైకాల సత్యనారాయణ టైటిల్ రోల్‌లో నటించిన ఈ చిత్రంలో రోజా, బేబీ నిఖిత, ఏ.వి.యస్, శరత్ బాబు, సుధ, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, చలపతిరావు, తనికెళ్ళ భరణి, గిరిబాబు, ప్రసాద్ బాబు, శివాజీరాజా, రాళ్ళపల్లి, గుండు హనుమంతరావు, శ్రీలక్ష్మి, టిను ఆనంద్ ముఖ్య పాత్రలు పోషించారు. ‘కింగ్’ నాగార్జున, డా.రాజశేఖర్, శ్రీకాంత్ అతిథి పాత్రల్లో దర్శనమిచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, భువనచంద్ర, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గీత రచనకు ఎస్.వి.కృష్ణారెడ్డి వీనుల విందైన బాణీలు అందించారు. “జజజ రోజా”, “అందాల అపరంజి బొమ్మ”, “భామరో నన్నే ప్యార్ కరో”, “ప్రియ మధురం”, “డింగు డింగు రోబోట్టురో”, “భమ్ భమ్ భమ్”.. ఇలా ఇందులోని ప్రతీ పాట ప్రేక్షకాదరణ పొందింది. కిషోర్ రాఠీ సమర్పణలో మనీషా ఫిలిమ్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. 1995 ఏప్రిల్ 27న విడుదలైన ‘ఘటోత్కచుడు’.. నేటితో 25 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: