హైదరాబాద్ లో “ఫైటర్ ” మూవీ షూటింగ్ ?

Vijay Deverakonda Fighter Movie Shooting Shifted To Hyderabad

పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా యాక్షన్ థ్రిల్లర్ “ఫైటర్”(వర్కింగ్ టైటిల్ ) మూవీ తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కై విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకంగా శిక్షణ పొందారు. ఈ పాన్ ఇండియా మూవీ లో బాలీవుడ్ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ అనన్య పాండే కథానాయిక. మణిశర్మ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముంబై లో 40 రోజుల పాటు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న “ఫైటర్ ” మూవీ తరువాత షెడ్యూల్ కూడా ముంబై లో జరగాల్సిఉంది. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. కరోనా ఎఫెక్ట్ మహారాష్ట్ర లో ఎక్కువగా ఉండటంతో లాక్ డౌన్ సమయం తరువాత దర్శకుడు పూరి జగన్నాథ్ హైదరాబాద్ లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ లో ప్రత్యేక సెట్స్ రూపొందించి షూటింగ్ జరపనున్నరని సమాచారం. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్” మూవీ తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. “ఫైటర్ ” మూవీ తో విజయ్ దేవరకొండ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.