ఒక డైరెక్టర్ కు అందరు హీరోలతో సినిమాలు చేయాలని ఉంటది. ఇక అందరు హీరోలకు కూడా ప్రతి డైరెక్టర్ తో సినిమా చేయాలనుకుంటారు. ఎందుకంటే ఒక్కో డైరెక్టర్ ది ఒక్కో స్టైల్ ఉంటది… ఒక్కో హీరో కి ఒక్కో స్టైల్ ఉంటది. కాబట్టి తమని తాము కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రాజమౌళి కూడా అగ్ర హీరో అయిన బాలకృష్ణ తో సినిమా చేయాలనుకున్నాడట కానీ కుదరలేదట. ఈ విషయాన్ని జక్కన్న స్వయంగా తానే చెప్పాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల రాజమౌళి ఇంట్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇంట్లో ఉంటూనే సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను పంచుకుంటూనే వున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయనను బాలకృష్ణతో ఎప్పుడైనా మూవీ చేయాలని అనుకున్నారా అని అడుగగా ”ఏ దర్శకుడికైనా ప్రతి హీరోతో మూవీ చేయాలని ఆశ ఉంటుంది. ఒక హీరోకి ఉండే ఇమేజ్ దృష్ట్యా కథ అనుకుంటున్నప్పడు ఆ హీరో ఐతే సరిపోతాడు అనిపిస్తుంది. నాకు కూడా కొన్ని కథలు వినేటప్పుడు బాలకృష్ణ సరిపోతారు ఆయనతో చేస్తే బాగుండు అనే ఆలోచన కలిగింది. ఐతే అనుకోని కారణాల వలన ఇప్పటివరకూ ఆయనతో సినిమా చేయలేకపోయాను అని తెలిపారు. మరి కొన్ని కొన్ని కాంబినేషన్స్ వినడానికి చాలా ఎక్సయిటింగ్ గా అనిపిస్తాయి. మహేష్ బాబు, రాజమౌళి సినిమా ఎప్పుడొస్తుందా అనుకున్నారు.. అది త్వరలోనే నిజమవ్వబోతుంది. ఇక బాలకృష్ణ తో కూడా జక్కన్న సినిమా తొందరలోనే రావాలని.. ఈ క్రేజీ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తదో చూద్దాం.
కాగా బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు.ఇంకా కొద్దిరోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది అనుకునే లోపు కరోనా వల్ల మరో పెద్ద బ్రేక్ వచ్చింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: