అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ తోనే అల్లు అర్జున్ సోషల్ మీడియాలో రికార్డ్స్ ను క్రియేట్ చేశాడు. ఇక ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి విదితమే. ఓ అటవీశాఖ అధికారి పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు అన్నారు. అయితే ఇటీవల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు విజయ్ సేతుపతి ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం చిత్ర బృందం తాజాగా బాబీ సింహాతో చర్చలు జరిపారట. ఇక కథ విన్న బాబీ సింహాకు కూడా పాత్ర నచ్చిందట. అయితే ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. మరి బాబీ సింహా ఓకే చెప్పిన వెంటనే అధికారికంగా ప్రకటిస్తారేమో చూద్దాం.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్ననటిస్తుండగా మరో హీరోయిన్ గా కేరళ కుట్టి నివేదా థామస్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: