‘కింగ్’ నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కలయికలో పలు మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ తెరకెక్కాయి. వాటిలో ‘ఘరానా బుల్లోడు’ ఒకటి. నాగ్ సరసన రమ్యకృష్ణ, ఆమని కథానాయికలుగా నటించగా.. జయచిత్ర, మురళీమోహన్, సుధ, జయంతి, తనికెళ్ళ భరణి, సుధాకర్, బ్రహ్మానందం, నూతన్‌ప్రసాద్, ఏవీయస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, మహేష్ ఆనంద్, శ్రీహరి ముఖ్య పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వేటూరి సుందరరామమూర్తి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, వెన్నెలకంటి సాహిత్యం సమకూర్చగా.. స్వరవాణి కీరవాణి వీనుల విందైన బాణీలు అందించారు. “భీమవరం బుల్లోడా”, “అదిరిందిరో”, “సై సై సయ్యారే”, “వంగి వంగి దండమెట్టు”, “ఏం కసి ఏం కసి”, “చుక్కల్లో జాబిల్లి”.. ఇలా ప్రతీ పాట విశేషాదరణ పొందింది. ఆర్.కె.ఫిల్మ్ అసోసియేట్స్ పతాకంపై కె.కృష్ణ మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1995 ఏప్రిల్ 27న విడుదలై అఖండ విజయం సాధించిన ‘ఘరానా బుల్లోడు’.. నేటితో 25 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: