యన్టీఆర్, ఏయన్నార్ తొలి మల్టీస్టారర్ ‘పల్లెటూరిపిల్ల’కు 70 ఏళ్ళు

NTR and ANR Evergreen Classic Palletoori Pilla Completes 70 Years.

మహానటులు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు కాంబినేష‌న్‌లో పలు మల్టీస్టారర్ మూవీస్ తెరకెక్కాయి. కాగా, ఈ తరహా చిత్రాలకు శ్రీకారం చుట్టిన సినిమాగా ‘పల్లెటూరిపిల్ల’కు ప్ర‌త్యేక స్థానముంది. అంజలీదేవి టైటిల్ రోల్‌లో న‌టించిన ఈ చిత్రంలో ఎస్.వి.రంగారావు, ఎ.వి.సుబ్బారావు, కోటేశ్వరరావు, లక్ష్మీకాంత, హేమలత, బాల సరస్వతి, బేబీ మల్లిక ముఖ్య భూమికలు పోషించారు. శోభనాచల & బి.ఎ.సుబ్బారావు జాయింట్ వెంచర్ పతాకంపై బి.ఎ.సుబ్బారావు ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాపీ ధర్మారావు, పి.ఆదినారాయణరావు గీత ర‌చ‌న చేయగా పి.ఆదినారాయణరావు స్వ‌రాలు సమకూర్చారు. “ప్రేమమయ”, “శాంత వంటి పిల్ల”, “చిన్నారి పాపాయి”, “చిటపట చినుకులు”, “పల్లెసీమల బ్రతుకే” వంటి గీతాలు ప్రేక్షకులను అలరించాయి. ‘ఇన్సానియత్’(1955) పేరుతో హిందీలోనూ ఈ చిత్రాన్ని పునర్నిర్మించారు. 1955 ఏప్రిల్ 27న విడుదలైన ‘పల్లెటూరిపిల్ల’.. నేటితో 70 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − four =