
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 121

అభిమానులకు సర్ ప్రైజ్
జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసలు
కూతురితో సింధూరం నటి సంఘవి..!

విజయ్-పూరీ సినిమా టైటిల్ 'ఫైటర్' కాదట..!

శేఖర్ కమ్ముల ‘గోదావరి’కి 14 ఏళ్ళు
ఎన్టీఆర్ బర్త్ డే కి విశ్వక్ స్పెషల్ గిఫ్ట్..!
పూరీ జగన్నాథ్ మరో పాన్ ఇండియా మూవీ
లావణ్య త్రిపాఠికి స్ఫూర్తి వాళ్లేనట
సమంత ఆన్ లైన్ జిమ్ పాఠాలు
సితార ఉంటే చాలు.. ప్లే లిస్ట్ అవసరం లేదు..!
మా కుటుంబంలోకి నీకు స్వాగతం రానా..!
మీ సేవ ముందు మాది పెద్ద విషయం కాదు..!
బాలీవుడ్ రీమేక్ మూవీ లో రాజ్ తరుణ్
ప్రజా గాయకురాలు పాత్ర లో సాయి పల్లవి ?
విక్రమ్ "కోబ్రా "మూవీ అప్ డేట్
KGF చాప్టర్ 2 మూవీ రిలీజ్ వాయిదా ?
రేపే యంగ్ హీరో నిఖిల్ పెళ్లి..!

సినిమా కొందరికి ప్యాషన్.. చాలా మందికి వ్యాపారం..!
కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిజానికి ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక మొన్ననే ఇస్తా.. మొత్తం తిరిగిచ్చేస్తా అని ట్వీట్ చేసి ఫ్యాన్స్ కి ప్రామిస్ కూడా చేసాడు. ఇక ఇప్పుడు తాజాగా మరో ట్వీట్ చేసాడు రామ్. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే.. సినిమా అనేది కొందరికి ప్యాషన్, చాలా మందికి వ్యాపారం…ఇక మిగిలిన వారికి జూదం అని చెప్పుకొచ్చారు. అయితే రామ్ ఈ ట్వీట్ ఎందుకు పెట్టాడా అన్న చర్చలు జరుగుతున్నాయి.
అభిమానులకు సర్ ప్రైజ్
"టెంపర్ ", "నాన్నకు ప్రేమతో ", "జనతా గ్యారేజ్ " , "జై లవకుశ " , "అరవింద సమేత వీర రాఘవ " వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షక ,అభిమానులను అలరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం "రౌద్రం రణం రుధిరం " మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. "RRR" మూవీ తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో #NTR 30 , బ్లాక్ బస్టర్ KGF చాప్టర్ 1 కన్నడ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసలు
మోడల్ , డాన్సర్ లావణ్య త్రిపాఠి సక్సెస్ ఫుల్ మూవీ "అందాల రాక్షసి " తో టాలీవుడ్ లో ప్రవేశించి "సోగ్గాడే చిన్ని నాయనా ", "భలే భలే మొగాడివోయ్ ", "అర్జున్ సురవరం "వంటి మూవీస్ తో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. "A 1 ఎక్స్ ప్రెస్ ", "చావు కబురు చల్లగా ", ఒక తమిళ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్న లావణ్య ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయ్యి కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు.
పవన్ సినిమాపై హరీష్ - తమ్ముడూ స్క్రిప్ట్, మ్యూజిక్ పనులు జరుగుతున్నాయి
ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా వున్నాడు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ అభిమాని తన ట్విట్టర్ ద్వారా ఎన్ని సినిమాలు అయినా చేయన్నా.. కానీ తదుపరి సినిమా పవర్ స్టార్ తో చేయి అంటూ ఓ అభిమాని చేసిన విన్నపానికి హరీశ్ స్పందించాడు. 'తమ్ముడూ... పవర్ స్టార్ మూవీ స్క్రిప్ట్ వర్క్, మ్యూజిక్ వర్క్ కొనసాగుతున్నాయి. పవన్ కల్యాణ్ చిత్రం తర్వాతే మరే కమిట్ మెంట్ అయినా. నేను కూడా మీలాంటి అభిమానే అని మర్చిపోకు' అని సమాధానం ఇచ్చాడు. ఇక సినిమాకు సంబంధిన వివరాలు త్వరలో తెలియనున్నాయి.
కూతురితో సింధూరం నటి సంఘవి..!
42 ఏళ్ల వయస్సులో నటి సంఘవి అమ్మ అయింది. పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా సంఘవికి సంబంధించిన సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. చాలా రోజుల తరువాత తన కూతురితో ఫోటోకి పొజివ్వడంతో ఆ ఫోటో వైరల్ గా మారింది. సంఘవి ఈ ఫోటోలో తన బిడ్డని ఒడిలో పెట్టుకొని కూర్చొని ఉంది.

కమల్ హాసన్, సరిత ప్రణయ దృశ్యకావ్యం ‘మరోచరిత్ర’కి 42 ఏళ్ళు
తెలుగునాట పలు ప్రేమకథా చిత్రాలు సందడి చేశాయి. అయితే ప్రేక్షకుల మదిలో సుస్థిరస్థానం సంపాదించుకుని చరిత్ర సృష్టించిన సినిమాలు మాత్రం కొన్నే ఉన్నాయి. అలాంటి చిత్రాల్లో ‘మరోచరిత్ర’ ఒకటి. దిగ్గజ దర్శకులు కె.బాలచందర్ తెరకెక్కించిన ఈ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో కమల్ హాసన్, సరిత నాయకానాయికలుగా నటించారు. అంతేకాదు.. ఈ సినిమాతోనే సరిత కథానాయికగా పరిచయం కావడం విశేషం. జె.వి.రమణమూర్తి, ‘కాకినాడ’ శ్యామల, పి.యల్.నారాయణ, జయవిజయ, మిశ్రో, కృష్ణచైతన్య ముఖ్య భూమికలు పోషించగా.. మాధవి కీలక పాత్రలో దర్శనమిచ్చింది. ఆండాళ్ ప్రొడక్షన్స్ పతాకంపై రామ అరంగణ్ణల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

విజయ్-పూరీ సినిమా టైటిల్ 'ఫైటర్' కాదట..!
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. అదేంటంటే.. మొదటినుండి ఈ సినిమా టైటిల్ 'ఫైటర్' అనే ఫిక్స్ అయిపోయాం కదా అయితే ఈ సినిమా టైటిల్ ఫైటర్ కాదట. ఈ విషయాన్ని ఈ సినిమాకు సహనిర్మాత అయిన ఛార్మి స్వయంగా చెప్పడం జరిగింది.

శేఖర్ కమ్ముల ‘గోదావరి’కి 14 ఏళ్ళు
ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ‘ఆనంద్’ వంటి విజయవంతమైన చిత్రం తరువాత శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన సినిమా ‘గోదావరి’. సుమంత్, కమలినీ ముఖర్జీ జంటగా నటించిన ఈ చిత్రంలో నీతూ చంద్ర, తనికెళ్ళ భరణి, సి.వి.యల్.నరసింహారావు, మధుమణి, లలిత సింధూరి, కమల్ కామరాజు, శివ ముఖ్య పాత్రలు పోషించారు.
ఎన్టీఆర్ బర్త్ డే కి విశ్వక్ స్పెషల్ గిఫ్ట్..!
మే 20న యంగ్ టైగర్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఇక తమ అభిమాన హీరోల పుట్టిన రోజు వస్తే అభిమానులు ఎలా జరుపుకుంటారో పెద్దగా చెప్పనవసరం లేదు.కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పుట్టిన రోజు వేడుకలు జరపవద్దని హీరోలు చెపుతున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా ఈ సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలు కూడా జరపొద్దని ఒక లేఖను విడుదల చేసాడు.
పూరీ జగన్నాథ్ మరో పాన్ ఇండియా మూవీ
'ఇస్మార్ట్' డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ప్రస్తుతం ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. నిర్మాణ దశలో ఉంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నాయికగా నటిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ భారీ బడ్జెట్ మూవీ రిలీజ్ కానుందని తెలిసింది.
లావణ్య త్రిపాఠికి స్ఫూర్తి వాళ్లేనట
'అందాల రాక్షసి' (2012)తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే మెస్మరైజ్ చేసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ఆపై 'భలే భలే మగాడివోయ్' (2015), 'సోగ్గాడే చిన్ని నాయనా' (2016)తో మెమరబుల్ హిట్స్ సొంతం చేసుకుంది. ఆ తరువాత కాస్త ట్రాక్ తప్పిన లావణ్య.. గత ఏడాది చివర్లో విడుదలైన 'అర్జున్ సురవరం'తో మళ్లీ విజయాన్ని అందుకుంది.
సమంత ఆన్ లైన్ జిమ్ పాఠాలు
ప్రాణాంతక కరోనా మహమ్మారి కారణంగా ప్రజలంతా ఇళ్ళకే పరిమితం అయిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ రద్దు కావడంతో ఇళ్ళకు పరిమితం అయిన సినీ సెలబ్రిటీస్ వర్క్ అవుట్స్, బుక్ రీడింగ్, వంటలు, ఇంటి పనులు, కొత్త భాషలు నేర్చుకొనడం , ఇంటి సభ్యులతో ఎంజాయ్ చేయడం వంటి కార్యక్రమాలతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సినీ హీరోయిన్స్ ఫిట్ నెస్ కై జిమ్ లకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. జిమ్ లు మూతపడడం తో కొంతమంది స్వయంగా వర్క్ అవుట్స్ చేస్తున్నారు.
సితార ఉంటే చాలు.. ప్లే లిస్ట్ అవసరం లేదు..!
సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి.. అల్లరి పిడుగు సితార గురించి ప్రేత్యేకంగా చెప్పేదేముంది. చిన్నప్పటి నుండి సితార స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ గానే నిలిచింది. ఇక ఇప్పుడు స్వయంగా ఒక యూ ట్యూబ్ ఛానల్ నే నిర్వహిస్తుంది. వంశీ పైడిపల్లి కూతురు ఆద్య తో కలిసి పలు వీడియోలు చేస్తూ సందడి చేస్తూనే ఉంటుంది. ఆడుతూ పాడుతూ వుండే వీడియోలే కాదు అప్పుడప్పుడు.. ఆ ఛానల్ ద్వారా వీరు సోషల్ అవెర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు.
మా కుటుంబంలోకి నీకు స్వాగతం రానా..!
తన ప్రేయసి మిహీకా బాజాజ్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు రానా నిన్న సోషల్ మీడియా ద్వారా ప్రకటించి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు రానాకు సోషల్ మీడియలో శుభాకాంక్షలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ జాబితాలో బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ కూడా చేరిపోయారు. మిహిక, సోనం మంచి స్నేహితులని తెలిసిందే. ఇప్పుడు తాజాగా మిహిక కు సోనమ్ కపూర్ కూడా దీనిపై స్పందించి అభినందనలు తెలిపారు. ‘‘డార్లింగ్ బేబీ మిహిక... నీకు శుభాకాంక్షలు. లవ్ యూ. అత్యుత్తమైనవి పొందేందుకు నువ్వు అర్హురాలివి. రానా.. నువ్వు సంతోషంగా ఉండేలా చూసుకుంటాడు. మా కుటుంబంలోకి నీకు స్వాగతం రానా’’ అంటూ…
మీ సేవ ముందు మాది పెద్ద విషయం కాదు..!
కరోనా వల్ల అందరూ ఇంట్లోనే వుంటూ కాలం గడుపుతున్న నేపథ్యంలో డాక్టర్స్, నర్సులు, పోలీస్ మరియు పారిశుధ్య కార్మికులు మాత్రం ఎలాంటి విశ్రాంతి లేకుండా మన కోసం రాత్రింబవళ్లు కష్టపడుతూనే వున్నారు. ఇక వారి కృషిని అందరూ ప్రశంసిస్తూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా వారికి సెల్యూట్ చెబుతున్నారు.
బాలీవుడ్ రీమేక్ మూవీ లో రాజ్ తరుణ్
సక్సెస్ ఫుల్ "ఉయ్యాలా జంపాలా " మూవీ తో రాజ్ తరుణ్ టాలీవుడ్ కు ఎంటర్ అయ్యి "సినిమా చూపిస్త మామ" , "కుమారి 21 F" , "కిట్టు ఉన్నాడు జాగ్రత్త ", "అంధగాడు", "రాజుగాడు" వంటి కామెడీ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన "ఒరేయ్ బుజ్జిగా " మూవీ కరోనా మహమ్మారి కారణంగా విడుదల వాయిదా పడింది.
ప్రజా గాయకురాలు పాత్ర లో సాయి పల్లవి ?
సక్సెస్ ఫుల్ "నీదీ నాదీ ఒకే కథ " మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా సురేష్ ప్రొడక్షన్స్ , శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై రొమాంటిక్ ఎంటర్ టైనర్ "విరాటపర్వం 1992 " మూవీ రూపొందుతుంది. పీరియాడిక్ డ్రామా గా రూపొందుతున్న ఈ మూవీ లో ప్రియమణి, నందితాదాస్, జరీనా వహాబ్ , నవీన్ చంద్ర, సాయి చంద్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
విక్రమ్ "కోబ్రా "మూవీ అప్ డేట్
విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటించే తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీ "కోబ్రా " లో నటిస్తున్నారు. సూపర్ హిట్ "ఇమైక్క నోడిగళ్" మూవీ ఫేమ్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై "కోబ్రా "మూవీ రూపొందుతుంది. బ్లాక్ బస్టర్ KGF చాప్టర్ 1 మూవీ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయిక కాగా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, దర్శకుడు KS రవి కుమార్, ఆనంద్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. AR రెహమాన్ సంగీతం అందించారు.
KGF చాప్టర్ 2 మూవీ రిలీజ్ వాయిదా ?
దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ మూవీ " KGF చాప్టర్1" కన్నడభాషలో ఘనవిజయం సాధించి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే.
రేపే యంగ్ హీరో నిఖిల్ పెళ్లి..!
లాక్ డౌన్ వల్ల యంగ్ హీరో నిఖిల్ వివాహం వాయిదా పడిన సంగతి తెలిసిందే. పల్లవి వర్మ అనే డాక్టర్ తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న నిఖిల్ పెద్దల అంగీకారంతో ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. ఏప్రిల్ 16న వీరి వివాహం జరగాలి. లాక్ డౌన్ అయినా గుడిలో పెళ్లి చేసుకుంటా అని గతంలో చెప్పాడు. అయితే ఆ తర్వాత మళ్ళీ వాయిదా వేశారు. ఇక ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడటంతో తాజాగా పెళ్లి ముహుర్తాన్ని నిర్ణయించినట్టు తెలుస్తుంది. రేపు నిఖిల్,పల్లవిల వివాహం జరగనున్నట్టు సమాచారం. మంచి ముహూర్తాలు లేకపోవడం.. మూఢం వల్ల మరో మూహూర్తం కోసం దాదాపు ఏడాది వరకు వేచి చూడాల్సి వస్తుందని హీరో నిఖిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు…