‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ప్రస్తుతం ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. నిర్మాణ దశలో ఉంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నాయికగా నటిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ భారీ బడ్జెట్ మూవీ రిలీజ్ కానుందని తెలిసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




ఇదిలా ఉంటే.. విజయ్ చిత్రం విడుదల కాకముందే మరో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడు పూరీ జగన్నాథ్. లాక్ డౌన్ ప్రకటించగానే కథకు శ్రీకారం చుట్టిన పూరి.. తాజాగా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసాడట. అంతేకాదు.. ఓ అగ్ర కథానాయకుడి కాంబినేషన్‌లో ఈ సినిమా ఉంటుందట. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























