కమల్ హాసన్, సరిత ప్రణయ దృశ్య‌కావ్యం ‘మరోచరిత్ర’కి 42 ఏళ్ళు

Kamal Haasan Evergreen Classic Maro Charitra Completes 42 Years

తెలుగునాట పలు ప్రేమకథా చిత్రాలు సంద‌డి చేశాయి. అయితే ప్రేక్షకుల మదిలో సుస్థిరస్థానం సంపాదించుకుని చ‌రిత్ర సృష్టించిన సినిమాలు మాత్రం కొన్నే ఉన్నాయి. అలాంటి చిత్రాల్లో ‘మరోచరిత్ర’ ఒకటి. దిగ్గ‌జ ద‌ర్శ‌కులు కె.బాల‌చంద‌ర్ తెర‌కెక్కించిన ఈ మ్యూజికల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో కమల్ హాసన్, సరిత నాయకానాయికలుగా నటించారు. అంతేకాదు.. ఈ సినిమాతోనే సరిత క‌థానాయికగా ప‌రిచ‌యం కావడం విశేషం. జె.వి.రమణమూర్తి, ‘కాకినాడ’ శ్యామల, పి.యల్.నారాయణ, జయవిజయ, మిశ్రో, కృష్ణచైతన్య ముఖ్య భూమికలు పోషించగా.. మాధవి కీలక పాత్రలో దర్శనమిచ్చింది. ఆండాళ్ ప్రొడక్షన్స్ పతాకంపై రామ అరంగణ్ణ‌ల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘మ‌న‌సు క‌వి’ ఆచార్య ఆత్రేయ సాహిత్యం సమకూర్చగా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ యమ్.యస్.విశ్వనాథన్ బాణీలు అందించారు. “ఏ తీగ పూవునో”(రెండు వెర్షన్స్), “పదహారేళ్ళకు నీలో నాలో”, “భలే భలే మగాడివోయ్”, “కలిసి ఉంటే కలదు సుఖము”, “విధిచేయు వింతలన్నీ”.. ఇలా ఇందులోని ప్రతీ పాట అజరామరంగా నిలిచిపోయింది.

‘మరోచరిత్ర’ను హిందీలో ‘ఏక్ దూజే కే లియే’(1981) పేరుతో రీమేక్ చేశారు. హిందీ వెర్ష‌న్‌కి కూడా బాలచందర్‌నే దర్శకత్వం వహించారు. అంతేకాదు.. హిందీనాట‌ కమల్, మాధవి నటీనటులుగా పరిచయం కాగా.. ‘గానగంధర్వుడు’ యస్.పి.బాలసుబ్రహ్మణ్యంకి కూడా ఇదే తొలి హిందీ చిత్రం కావ‌డం విశేషం. కన్నడలో ‘లవ్ స్టోరీ’(2005) టైటిల్‌తోనూ, ఒడియాలో ‘తూ మేరి పాయేన్’గానూ, తెలుగులో ‘మరోచరిత్ర’(2010) పేరుతోనూ ‘మరోచరిత్ర’ను రీమేక్ చేశారు.

ఈ చిత్రానికి గానూ ‘ఉత్తమ దర్శకుడు’ విభాగంలో కె.బాలచందర్ ‘ఫిలిమ్‌ఫేర్ – సౌత్’ అవార్డును సొంతం చేసుకోవడం విశేషం. 1978 మే 19న విడుదలైన అపురూప ప్రణయ దృశ్యకావ్యం ‘మరోచరిత్ర’.. నేటితో 42 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =