‘అందాల రాక్షసి’ (2012)తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే మెస్మరైజ్ చేసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ఆపై ‘భలే భలే మగాడివోయ్’ (2015), ‘సోగ్గాడే చిన్ని నాయనా’ (2016)తో మెమరబుల్ హిట్స్ సొంతం చేసుకుంది. ఆ తరువాత కాస్త ట్రాక్ తప్పిన లావణ్య.. గత ఏడాది చివర్లో విడుదలైన ‘అర్జున్ సురవరం’తో మళ్లీ విజయాన్ని అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ జరిపింది లావణ్య త్రిపాఠి. అందులో భాగంగా.. తనకు స్ఫూర్తినిచ్చిన కథానాయికల గురించి చెప్పమని ఓ అభిమాని అడిగితే.. శ్రీదేవి, మాధురీ దీక్షిత్ పేర్లను చెప్పుకొచ్చింది లావణ్య. తను నటిగా మారడం వెనుక ఆ ఇద్దరి స్ఫూర్తి ఎంతో ఉందని తెలిపింది.
కాగా, ప్రస్తుతం లావణ్య చేతిలో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’, ‘చావు కబురు చల్లగా’ చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లో ఒకదానితో ఒకటి పొంతన లేని పాత్రల్లో నటిస్తోంది లావణ్య. లాక్ డౌన్ పిరియడ్ ముగిసిన తరువాత ఈ సినిమాలకు సంబంధించిన చిత్రీకరణ పునః ప్రారంభం కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























