
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 120


ఈ రోజు మాటలే.. ఎంగేజ్‌మెంట్ కాదు..!

"అహం బ్రహ్మస్మి "స్పెషల్ పోస్టర్
ఫ్లోటింగ్ వాటర్ సౌండ్ తో అదితి డ్యాన్స్
నీకు బెస్ట్ గిఫ్ట్ ఇస్తా మాటిస్తున్నా..!
"అహం బ్రహ్మస్మి " మూవీ లో భారీ యాక్షన్ సీన్
మల్టీస్టారర్ గా హరీశ్ కొత్త సినిమా..!
సుకుమార్ శిష్యుడితో నాని చిత్రం?
చిరు, తారక్ చిత్రాల్లో జెనీలియా?


ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ - ఫ్యాన్స్ ఫిదా

"పుష్ప " మూవీ షూటింగ్ లొకేషన్స్ ఛేంజ్

ఎన్టీఆర్ కు వార్నర్ బర్త్ డే విషెస్..!
టిక్ టాక్ వీడియోస్ తో బిజీ
రానా-ప్రభాస్ మరోసారి..?

హీరో రానా , మిహీకా బజాజ్ ల నిశ్చితార్థం
సక్సెస్ ఫుల్ "లీడర్ " మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన రానా దగ్గుబాటి "కృష్ణం వందే జగద్గురుమ్ "," రుద్రమదేవి", బాహుబలి ", "ఘాజి ", "నేనే రాజు నేనే మంత్రి "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. తమిళ భాషతో పాటు హిందీ మూవీస్ లో నటిస్తున్నారు. రానా ప్రస్తుతం "విరాటపర్వం 1992 "మూవీ లో నటిస్తున్నారు. రణహీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన "అరణ్య " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ రోజు మాటలే.. ఎంగేజ్‌మెంట్ కాదు..!
అదిగో తోక అంటే ఇదిగో పులి అన్నట్టు.. సెలబ్రిటీస్ గురించి వార్తలు మాత్రం ఈ రేంజ్ లోనే వస్తుంటాయి. అలానే ఉంది ఇప్పుడు రానా విషయంలో. ఇటీవలే తన ప్రేమను సోషల్ మీడియా వేదికగా బయటి ప్రపంచానికి పరిచయం చేశాడు రానా. మిహిక బజాజ్ తో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న రానా ఫైనల్లీ ఎస్ చెప్పింది అని ట్విట్టర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక రానా ఇచ్చిన షాక్ కు అందరూ మొదట షాకవ్వగా.. ఆ తర్వాత అందరు అభినందనలు తెలిపారు. కొంతమంది టాలీవుడ్ హీరోలు మాత్రం కామెడీ కూడా చేశారనుకోండి. ఇక ప్రభాస్, రానా పై వచ్చిన మీమ్ ల సంగతి గురించైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ రెండు రోజులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసాయి.

"అహం బ్రహ్మస్మి "స్పెషల్ పోస్టర్
మనోజ్ మంచు స్వంత బ్యానర్ ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పై నూతన దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో మనోజ్ హీరోగా "అహం బ్రహ్మస్మి "మూవీ రూపొందుతుంది. రాజా ఆఫ్ విక్రమ్ సింహపురి గా మనోజ్ నటిస్తున్న ఈ మూవీ తెలుగు ,తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.
'పక్కా లోకల్’ సాంగ్‌తో ఎన్టీఆర్ కు మరోసారి వార్నర్ విషెస్..!
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎన్టీఆర్ అభిమాని కోరిక మేరకు నిన్న ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పిన సంగతి తెలిసిందే. రేపు పుట్టినరోజు కావడంతో...జూనియర్ ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపమని ఓ అభిమాని ట్విట్టర్ వేదికగా డేవిడ్ వార్నర్ ను కోరగా "హ్యాపీ బర్త్ డే బడ్డీ" అంటూ ట్వీట్ చేసాడు.
ఫ్లోటింగ్ వాటర్ సౌండ్ తో అదితి డ్యాన్స్
సక్సెస్ ఫుల్ "సమ్మోహనం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన బాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదరి "అంతరిక్షం 9000 KMPH"మూవీ తో ప్రేక్షకులను అలరించారు. "ఏ సాలీ జిందగీ ", "పద్మావత్ " మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన అదితి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. "కాట్రు వెళియిడై " తమిళ మూవీ కి బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్ అందుకున్నారు. తమిళ , హిందీ మూవీస్ తో బిజీగా ఉన్న అతిది నటించిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
నీకు బెస్ట్ గిఫ్ట్ ఇస్తా మాటిస్తున్నా..!
ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి అప్ డేట్ లేదుకానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఎన్టీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు ఎన్టీఆర్ కు విషెస్ తెలియచేయగా ఇప్పుడు హీరో రామ్‌చరణ్ కూడా ఎన్టీఆర్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేశారు. ‘నా ప్రియమైన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. నేను నీకు రిటర్న్ గిఫ్ట్ బాకీ ఉన్నానని తెలుసు. కానీ నేను ఉత్తమమైన గిఫ్ట్ ఇస్తానని మాట ఇస్తున్నాను. మరెన్నో సెలబ్రేషన్ ముందున్నాయి.. ’ అని ట్వీట్ చేసాడు.
ఎన్టీఆర్ కు బిగ్‌బాస్ టీమ్ స్పెషల్ వీడియో తో విషెస్..!
ఈ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హవానే నడుస్తుంది. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1 టీమ్ కూడా ఎన్టీఆర్ కు స్పెషల్ వీడియో తో విషెస్ చెప్పారు.
"అహం బ్రహ్మస్మి " మూవీ లో భారీ యాక్షన్ సీన్
సూపర్ హిట్ "దొంగ దొంగది " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన మనోజ్ మంచు "శ్రీ ", "నేను మీకు తెలుసా ?", బిందాస్ ", "వేదం ", కరెంట్ తీగ " వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. "ఒక్కడు మిగిలాడు "(2017 ) మూవీ తరువాత మనోజ్ మూవీస్ లో నటించలేదు. 3 సంవత్సరాల తరువాత మనోజ్ తన స్వంత బ్యానర్ MM ఆర్ట్స్ పై "అహం బ్రహ్మస్మి " మూవీ లో నటిస్తూ నిర్మిస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్‌బాబు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘బ్రహ్మోత్సవం’కు 4 ఏళ్ళు
కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్‌కు పెద్ద పీట వేసే అగ్ర కథానాయకుల్లో సూపర్ స్టార్ మహేష్‌బాబు ఒకరు. జయాపజయాలను పక్కన పెడితే కొత్త తరహా చిత్రాలను చేయడంలో ఎప్పుడు ముందుంటాడు మహేష్. అలా మహేష్ చేసిన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌లో ‘బ్రహ్మోత్సవం’ ఒకటి. “ఏడు తరాల మూలాలను వెతుక్కోవడం” అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ వంటి విజయవంతమైన చిత్రం తరువాత మహేష్, శ్రీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత నాయికలుగా నటించారు. సత్యరాజ్, రేవతి, రావురమేష్, జయసుధ, నరేష్, తనికెళ్ళ భరణి, తులసి, ‘శుభలేఖ’ సుధాకర్, నాజర్…
మల్టీస్టారర్ గా హరీశ్ కొత్త సినిమా..!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో హరీశ్ శంకర్ 'గద్దలకొండ గణేశ్' సినిమా 14 రీల్స్ సంస్థ హరీశ్ తో మరో సినిమా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక లాక్ డౌన్ అనంతరం, పరిస్థితులన్నీ సర్దుకున్న తర్వాత పూర్తి వివరాలను ప్రకటిస్తామని తెలిపారు. మరి అలా ప్రకటించారో లేదో అప్పుడే రూమర్స్ స్టార్ట్ అయిపోయాయి. ఈ సినిమాపై స్టార్ట్ అయిన రూమర్ ఏంటంటే.. ఈ సినిమా మల్టీ స్టారర్ అని. అంతేకాదు ఇద్దరు యంగ్ హీరోలు ఈ సినిమాలో నటించనున్నట్టు వారి పేర్లు చెప్పేసుకుంటున్నారు. ఇంతకీ ఆ యంగ్ హీరోలు ఎవరనుకుంటున్నారు. ఇంకెవరూ నితిన్, సాయి తేజ్. అంతేకాదు నితిన్ ఆల్రెడీ హీరోగా ఖరారైనట్లు.. మరో హీరో పాత్ర కోసం సాయి తేజ్ తో…
సుకుమార్ శిష్యుడితో నాని చిత్రం?
కొత్త దర్శకులకి అవకాశం ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటాడు నేచురల్ స్టార్ నాని. రమేష్ వర్మ, సత్య బెల్లంకొండ, నందినీ రెడ్డి, అంజన, నాగ్ అశ్విన్, శివ నిర్వాణ.. ఇలా పలువురు నూతన దర్శకులతో సినిమాలు చేశాడు నాని. వీటిలో సింహభాగం విజయం సాధించాయి. ఈ క్రమంలోనే.. తాజాగా మరో న్యూ టాలెంట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నాని.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో సుధీర్ వర్మ చిత్రం?
గత ఏడాది విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ 'రాక్షసుడు'తో కెరీర్ బెస్ట్ హిట్‌ని అందుకున్నాడు యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రస్తుతం 'కందిరీగ' దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో 'అల్లుడు అదుర్స్' సినిమా చేస్తున్నాడు. నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ నాయికలుగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ .. చిత్రీకరణ తుది దశలో ఉంది.
చిరు, తారక్ చిత్రాల్లో జెనీలియా?
'హ.. హ.. హ.. హాసిని' అంటూ 'బొమ్మరిల్లు'లో జెనీలియా చేసిన సందడిని అంత సులువుగా మరచిపోలేం. పరిమిత సంఖ్యలో సినిమాలు చేసినా.. తెలుగునాట ఎనలేని గుర్తింపును సంపాదించుకుంది జెనీలియా. పెళ్లయ్యాక సినిమాలకు దూరం అయిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. రీ-ఎంట్రీకి రెడీ అవుతోందని సమాచారం. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. రెండు భారీ బడ్జెట్ చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించనుందట జెన్నీ.

యంగ్ టైగర్ యన్టీఆర్ బర్త్‌డే స్పెషల్‌గా విడుదలైన తొలి చిత్రం ‘నరసింహుడు’కి 15 ఏళ్ళు
‘యంగ్ టైగర్’ యన్టీఆర్ అంటేనే యాక్టింగ్ పవర్ హౌస్. తన సినిమాల తీరుతెన్నులు ఎలా ఉన్నా తన పర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు తారక్. అలా యన్టీఆర్ తన అభినయంతో ఆడియన్స్‌ను అలరించిన చిత్రం ‘నరసింహుడు’. కెరీర్ ఆరంభం నుంచి పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో థియేటర్‌లలో అభిమానులతో చప్పట్లు కొట్టించే తారక్.. ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌లో కనీసం ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా, కేవలం హావభావాలతోనే ఆకట్టుకోవడం విశేషం. ‘అల్లరి రాముడు’(2002) తరువాత యన్టీఆర్, అగ్రశ్రేణి దర్శకుడు బి.గోపాల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో యన్టీఆర్‌కి జోడిగా సమీరా రెడ్డి, అమీషా పటేల్ నటించారు. కైకాల సత్యనారాయణ, తనికెళ్ళ…

ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ - ఫ్యాన్స్ ఫిదా
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని 'ఆర్ఆర్ఆర్' చిత్రం నుంచి కొమురం భీమ్ పాత్రకు సంబంధించి వీడియో ప్రోమో వస్తుందని భావించిన అభిమానులు ఎంతగానో ఆశ పడ్డారు. కానీ ఆ సినిమా నుండి ఎలాంటి వీడియో కానీ, ఫస్ట్ లుక్ కానీ విడుదల చేయడం లేదని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఎంతో నిరాశకు గురయ్యారు.ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు ఎలాంటి అప్ డేట్ లేదని నిరాశలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులకు నిన్న సోషల్ మీడియాలో విడుదల చేసిన ఫొటో మామూలు కిక్ ఇవ్వలేదు.

ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్టీఆర్ బల్క్ డేట్స్...?
ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈసినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ 'కేజీఎఫ్' చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయనున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గా కథను ప్రస్తుతం ప్రశాంత్ రెడీ చేసే పనిలో ఉన్నాడట. దీనిని పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, కన్నడ, హిందీ భాషాల్లో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

"పుష్ప " మూవీ షూటింగ్ లొకేషన్స్ ఛేంజ్
బ్లాక్ బస్టర్ "రంగస్థలం "మూవీ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో "పుష్ప" మూవీ రూపొందుతుంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై రూపొందుతున్న "పుష్ప" మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. "పుష్ప " మూవీలో యాక్షన్ సీన్స్ హై లైట్ గా ఉంటాయని సమాచారం .

ఎన్టీఆర్ కు వార్నర్ బర్త్ డే విషెస్..!
మొత్తానికి లాక్ డౌన్ వల్ల క్రికెట్ మ్యాచ్ లు కూడా రద్దవడంతో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు మంచి టైం దొరికినట్టుంది. ఈ మధ్య తెలుగు సినిమా, పాటల వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. ఇప్పటికే అల వైకుంఠపురములో సినిమా పాటలకు స్టెప్ లు వేయగా.. పోకిరి సినిమాలోని మహేష్ డైలాగ్, బాహుబలి సినిమాలోని డైలాగ్ చెప్పి అలరించాడు.
టిక్ టాక్ వీడియోస్ తో బిజీ
"ఒరు అదార్ లవ్ " మలయాళ మూవీ తో ప్రియా ప్రకాష్ వారియర్ సినీ కెరీర్ ప్రారంభించారు. ఆ మూవీ లో ఒక సాంగ్ లో కన్ను గీటే ఎక్స్ ప్రెషన్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని ఓవర్ నైట్ స్టార్ గా మారారు. వింక్ గర్ల్ గా పేరొందిన ప్రియా ప్రకాష్ "శ్రీదేవి బంగళా "మూవీ తో బాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. మరో బాలీవుడ్ మూవీ "లవ్ హ్యాకర్స్ "కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. "విష్ణు ప్రియ" మూవీ తో కన్నడ చిత్ర పరిశ్రమ కు, నితిన్ హీరోగా రూపొందుతున్న "చెక్"మూవీ తో తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రియా ప్రకాష్ పరిచయం అవుతున్నారు.
రానా-ప్రభాస్ మరోసారి..?
బాహుబలి సినిమా అంటే మొదట మనకు గుర్తొచ్చేది బాహుబలి ప్రభాస్-భళ్లాలదేవ రానా. వారిద్దరూ లేకపోతే ఆ సిరీస్ లేనట్టే అని చెప్పొచు. ఇక ఈ సినిమాతో అటు ప్రభాస్, రానా కెరీర్ రేంజ్ ఏ కాదు.. తెలుగు సినిమా రేంజ్ కూడా పెరిగిపోయింది. ఇక ఇదిలా ఉండగా వీరిద్దరూ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి.