ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా వున్నాడు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ అభిమాని తన ట్విట్టర్ ద్వారా ఎన్ని సినిమాలు అయినా చేయన్నా.. కానీ తదుపరి సినిమా పవర్ స్టార్ తో చేయి అంటూ ఓ అభిమాని చేసిన విన్నపానికి హరీశ్ స్పందించాడు. ‘తమ్ముడూ… పవర్ స్టార్ మూవీ స్క్రిప్ట్ వర్క్, మ్యూజిక్ వర్క్ కొనసాగుతున్నాయి. పవన్ కల్యాణ్ చిత్రం తర్వాతే మరే కమిట్ మెంట్ అయినా. నేను కూడా మీలాంటి అభిమానే అని మర్చిపోకు’ అని సమాధానం ఇచ్చాడు. ఇక సినిమాకు సంబంధిన వివరాలు త్వరలో తెలియనున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Thammudu….. Power Star movie script work and music work under progress!! What ever may be the new commitment would be only after #PSPK28 👍👍 Nenu kooda mee lanti Fan ani marchipoku!! https://t.co/9PdjDRsKIQ
— Harish Shankar .S (@harish2you) May 18, 2020




ఇక ఇదిలా ఉండగా ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే మరో ఛాన్స్ కొట్టేసాడు హరీశ్ శంకర్. ‘గద్దలకొండ గణేశ్’ చిత్రం తర్వాత పవర్ ఫుల్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తో మరోసారి పని చేయబోతుండటం సంతోషంగా, గర్వంగా ఉందని 14 రీల్స్ సంస్థ ప్రకటించింది. లాక్ డౌన్ అనంతరం, పరిస్థితులన్నీ సర్దుకున్న తర్వాత పూర్తి వివరాలను ప్రకటిస్తామని తెలిపింది. మొత్తానికి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: