సుకుమార్ శిష్యుడితో నాని చిత్రం?

Natural Star Nani Gives A Movie Chance For Director Sukumar Associate Srikanth

కొత్త దర్శకులకి అవకాశం ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటాడు నేచురల్ స్టార్ నాని. రమేష్ వర్మ, సత్య బెల్లంకొండ, నందినీ రెడ్డి, అంజన, నాగ్ అశ్విన్, శివ నిర్వాణ.. ఇలా పలువురు నూతన దర్శకులతో సినిమాలు చేశాడు నాని. వీటిలో సింహభాగం విజయం సాధించాయి. ఈ క్రమంలోనే.. తాజాగా మరో న్యూ టాలెంట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నాని.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే.. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్.. ఇటీవల నానిని సంప్రదించి ఓ ఆసక్తికరమైన కథను చెప్పాడట. స్టోరీ లైన్ ఇంప్రెసివ్‌గా ఉండడంతో నాని వెంటనే ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. అంతేకాదు.. సుకుమార్‌నే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడని తెలిసింది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఫుల్ క్లారిటీ రానుంది.

ఇదిలా ఉంటే.. నాని సిల్వర్ జూబ్లీ ఫిలిమ్‌ ‘వి’ విడుదలకు సిద్ధమైంది. మరోవైపు ‘ట‌క్‌ జగదీష్’, ‘శ్యామ్ సింగ రాయ్‌’ చిత్రాలు చేతిలో ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =