ఎన్టీఆర్ కు వార్నర్ బర్త్ డే విషెస్..!

Australian Cricketer David Warner Greets Birthday Wishes To Jr NTR A Day In Advance

మొత్తానికి లాక్ డౌన్ వల్ల క్రికెట్ మ్యాచ్ లు కూడా రద్దవడంతో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు మంచి టైం దొరికినట్టుంది. ఈ మధ్య తెలుగు సినిమా, పాటల వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. ఇప్పటికే అల వైకుంఠపురములో సినిమా పాటలకు స్టెప్ లు వేయగా.. పోకిరి సినిమాలోని మహేష్ డైలాగ్, బాహుబలి సినిమాలోని డైలాగ్ చెప్పి అలరించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో.. ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పి షాకిచ్చాడు. రేపు పుట్టినరోజు కావడంతో…జూనియర్ ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపమని ఓ అభిమాని ట్విట్టర్ వేదికగా డేవిడ్ వార్నర్ ను కోరగా.. వార్నర్ సానుకూలంగా స్పందించాడు. “హ్యాపీ బర్త్ డే బడ్డీ” అంటూ ట్వీట్ చేసాడు.

ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈసినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ‘కేజీఎఫ్’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయనున్నట్టు తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + twelve =