ఈ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హవానే నడుస్తుంది. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1 టీమ్ కూడా ఎన్టీఆర్ కు స్పెషల్ వీడియో తో విషెస్ చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ షో అంత సక్సెస్ అవ్వడానికి ఒక రకంగా ఎన్టీఆరే కారణమని చెప్పొచ్చు. హౌస్‌మేట్స్‌ను ఆటపట్టిస్తూ, తప్పు చేసినప్పుడు సీరియస్ గా చెప్పడం..మరోవైపు తన మాటలతో వారిలో ఉత్సాహం నింపుతూ ఇలా ఎన్టీఆర్ హోస్టింగ్ కు అందరూ ఫిదా అయిపోయారు. ఇప్పటికి మూడు సీజన్ ను అవ్వగా బెస్ట్ యాంకర్ ఎవరంటే మాత్రం ఎన్టీఆర్ పేరే చెపుతారు ఎవరైనా. అంత ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ సీజన్ 1లో పాల్గొన్న హౌస్‌మేట్స్ ఆదర్శ్ బాలకృష్ణ, అర్చన, దీక్షాపంథ్, హరితేజ, శివ బాలజీ, ధన్‌రాజ్, ప్రిన్స్, కత్తి మహేష్, సంపూర్ణేష్ బాబు, మధుప్రియ, కత్తి కార్తీక, జ్యోతి, కల్పన, ముమైత్ ఖాన్‌లు ఓ ప్రత్యేక వీడియో ద్వారా తారక్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ… విషెస్ తెలిపారు. ఈ వీడియోను మ్యూజిక్ డైరక్టర్ థమన్ తన ట్విటర్ ఖాతా ద్వారా విడుదల చేశాడు.
Extremely Happy to Release this #SpecialBirthdayvideo made with lots of love & regards for #Tarakanna Garu
From our #BigBoss1HousematesHappy Birthday 🎈🎉♥️@tarak9999 Garu🤗#HappyBirthdayNTRhttps://t.co/RKZH3FFVsT@Dhanrajoffl @ActorSivabalaji@RaghuStarMaa
— thaman S (@MusicThaman) May 20, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: