“ఒరు అదార్ లవ్ ” మలయాళ మూవీ తో ప్రియా ప్రకాష్ వారియర్ సినీ కెరీర్ ప్రారంభించారు. ఆ మూవీ లో ఒక సాంగ్ లో కన్ను గీటే ఎక్స్ ప్రెషన్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని ఓవర్ నైట్ స్టార్ గా మారారు. వింక్ గర్ల్ గా పేరొందిన ప్రియా ప్రకాష్ “శ్రీదేవి బంగళా “మూవీ తో బాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. మరో బాలీవుడ్ మూవీ “లవ్ హ్యాకర్స్ “కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “విష్ణు ప్రియ” మూవీ తో కన్నడ చిత్ర పరిశ్రమ కు, నితిన్ హీరోగా రూపొందుతున్న “చెక్”మూవీ తో తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రియా ప్రకాష్ పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




టిక్ టాక్ వీడియోస్ రూపొందించడం లో ప్రియప్రకాష్ యాక్టివ్ గా ఉన్నారు. పలు వీడియోస్ రూపొందిస్తూ లాక్ డౌన్ సమయాన్ని బిజీగా స్పెండ్ చేస్తున్నారు. వీడియోస్ తో అభిమానులను అలరిస్తున్నారు. తాను జీవితంలో ఏం చేయాలో , ఏం చేయకూడదో అని ఒక టిక్ టాక్ వీడియో రూపొందించారు. సూపర్ హిట్ “చెన్నై ఎక్స్ ప్రెస్ “మూవీలో మీనమ్మ (దీపికా పడుకొనే ) ను ఇమిటేట్ చేస్తూ ఒక వీడియో, సాంగ్స్, డైలాగ్స్ కు లిప్ సింక్ చేస్తూ కొన్ని వీడియో లు , తన డ్యాన్సింగ్ స్కిల్స్ తో మరో వీడియో రూపొందించి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తన బ్రదర్ తో కలసి కొన్ని వీడియోస్ రూపొందించిన ప్రియప్రకాష్ బ్లాక్ బస్టర్ “గల్లీ బాయ్ ” మూవీ లో అలియా భట్ ను ఇమిటేట్ చేస్తూ ఒక వీడియో రూపొందించారు. ఈ విధంగా ప్రియా ప్రకాష్ పలు టాపిక్స్ తో టిక్ టాక్ వీడియోస్ రూపొందించి అభిమానులను అలరిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























