జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం నుంచి కొమురం భీమ్ పాత్రకు సంబంధించి వీడియో ప్రోమో వస్తుందని భావించిన అభిమానులు ఎంతగానో ఆశ పడ్డారు. కానీ ఆ సినిమా నుండి ఎలాంటి వీడియో కానీ, ఫస్ట్ లుక్ కానీ విడుదల చేయడం లేదని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఎంతో నిరాశకు గురయ్యారు.ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు ఎలాంటి అప్ డేట్ లేదని నిరాశలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులకు నిన్న సోషల్ మీడియాలో విడుదల చేసిన ఫొటో మామూలు కిక్ ఇవ్వలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నిన్న చెప్పినట్టే ఎన్టీఆర్ ఫిట్నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ రిలీజ్ చేశాడు. అలా రిలీజ్ చేసాడో లేదో ఇలా లైక్ లు.. షేర్ లతో ఎన్టీఆర్ అభిమానులు వైరల్ చేసేసారు.ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ ఫొటో నే హల్ చల్ చేస్తుంది. ఏదో ఊహించినంత కాకపోయినా… ఈ రకంగా అయినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కాస్త ఊరట నిచ్చారు.
Very happy to present this unseen image of @tarak9999 .. I hope you all like it 😎
📸 By @DabbooRatnani #HappyBirthdayNTR 🎉#StayHomeStaySafe 🙏🏼 pic.twitter.com/3dzvynlUq3
— Lloyd Stevens (@lloydstevenspt) May 19, 2020
మరోవైపు త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి… అలాగే కెజిఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేయనున్న చిత్రాలపై కూడా ఏమైనా అప్ డేట్స్ రావొచ్చేమో అని ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈసినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ‘కేజీఎఫ్’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయనున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: