సూప‌ర్ స్టార్ మహేష్‌బాబు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘బ్రహ్మోత్సవం’కు 4 ఏళ్ళు

Super Star Mahesh Babu Wholesome Family Entertainer Brahmostavam Completes 4 Years

కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్‌కు పెద్ద పీట వేసే అగ్ర కథానాయకుల్లో సూపర్ స్టార్ మహేష్‌బాబు ఒకరు. జయాపజయాలను పక్కన పెడితే కొత్త తరహా చిత్రాలను చేయడంలో ఎప్పుడు ముందుంటాడు మహేష్. అలా మ‌హేష్ చేసిన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌లో ‘బ్రహ్మోత్సవం’ ఒక‌టి. “ఏడు తరాల మూలాలను వెతుక్కోవడం” అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ వంటి విజయవంతమైన చిత్రం తరువాత మహేష్, శ్రీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత నాయిక‌లుగా నటించారు. సత్యరాజ్, రేవతి, రావురమేష్, జయసుధ, నరేష్, తనికెళ్ళ భరణి, తులసి, ‘శుభలేఖ’ సుధాకర్, నాజర్, శరణ్య, ఈశ్వరీ రావు, షాయాజీ షిండే, రోహిణీ హట్టంగడి, ముకేష్ రుషి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్ రెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, ‘వెన్నెల’ కిషోర్, కృష్ణభగవాన్.. ఇలా భారీ తారాగ‌ణంతో రూపొందింది ‘బ్రహ్మోత్సవం’.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, కృష్ణచైతన్య, శ్రీకాంత్ అడ్డాల గీతరచనకు మిక్కీ జె మేయ‌ర్ స్వరాలు సమకూర్చాడు. గోపిసుంద‌ర్ నేప‌థ్య సంగీతం అందించాడు. “బ్రహ్మోత్సవం”(టైటిల్ సాంగ్), “వచ్చింది కదా అవకాశం”, “బాలా త్రిపురమణి”, “పుట్ యువర్ హ్యాండ్స‌ప్‌”, “ఆటాపాటలాడు” వంటి పాటలతో పాటు “మధురం మధురం”, “నాయిడోరింటికాడ” లాంటి సాంప్ర‌దాయ‌బ‌ధ్ధ‌మైన గీతాలు కూడా అలరించాయి. ప్రసాద్ వి.పొట్లూరి, మహేష్‌బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 2016 మే 20న విడుదలైన ‘బ్రహ్మోత్సవం’.. నేటితో 4 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =