ఈ రోజు మాటలే.. ఎంగేజ్‌మెంట్‌ కాదు..!

Tollywood Ace Producer Suresh Babu Quashes News About Rana Engagement On Social Media

అదిగో తోక అంటే ఇదిగో పులి అన్నట్టు.. సెలబ్రిటీస్ గురించి వార్తలు మాత్రం ఈ రేంజ్ లోనే వస్తుంటాయి. అలానే ఉంది ఇప్పుడు రానా విషయంలో. ఇటీవలే తన ప్రేమను సోషల్ మీడియా వేదికగా బయటి ప్రపంచానికి పరిచయం చేశాడు రానా. మిహిక బజాజ్ తో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న రానా ఫైనల్లీ ఎస్ చెప్పింది అని ట్విట్టర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక రానా ఇచ్చిన షాక్ కు అందరూ మొదట షాకవ్వగా.. ఆ తర్వాత అందరు అభినందనలు తెలిపారు. కొంతమంది టాలీవుడ్ హీరోలు మాత్రం కామెడీ కూడా చేశారనుకోండి. ఇక ప్రభాస్, రానా పై వచ్చిన మీమ్ ల సంగతి గురించైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ రెండు రోజులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ రోజు పొద్దునే వచ్చిన వార్త దగ్గుబాటి రానా-మిహికా బజాజ్‌ల నిశ్చితార్థం ఈ రోజే అని. ఇప్పటికే పలు కథనాలు కూడా వచ్చేసాయి. ఇక ఈ వార్తలపై స్పందించిన ప్రముఖ నిర్మాత, రానా తండ్రి సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. రానా నిశ్చితార్థం ఈ రోజు జరగడం లేదని ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్పష్టం చేశారు. ఈ రోజు కేవలం ఇరు కుటుంబాల పెద్దల సమావేశం మాత్రమే ఉంటుందని ఆయన చెప్పారు. హిందూ సాంప్రదాయం ప్రకారం నిశ్చితార్థానికి ముందు ఇరు కుటుంబాల పెద్దలు కూర్చుని మంచి, చెడులు చర్చిస్తారని.. అలా తాము కూడా ఈ రోజు మిహికా బజాజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతామని సురేష్ బాబు తెలిపారు. నిశ్చితార్థం, వివాహం ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేయాలనే దానిపై మాట్లాడుకోవాలి… పెద్దలు కూర్చుని అన్నీ మాట్లాడుకున్నాక రానా వివాహంపై మీడియాకు సమాచారం ఇస్తామని నిర్మాత సురేష్ బాబు పేర్కొన్నారు. మరి సురేష్ బాబు క్లారిటీ ఇచ్చే లోపు ఇంకెన్ని రూమర్లు వచేస్తాయో..

ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా విరాటపర్వం 1992 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − nine =