ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి అప్ డేట్ లేదుకానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఎన్టీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు ఎన్టీఆర్ కు విషెస్ తెలియచేయగా ఇప్పుడు హీరో రామ్‌చరణ్ కూడా ఎన్టీఆర్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేశారు. ‘నా ప్రియమైన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. నేను నీకు రిటర్న్ గిఫ్ట్ బాకీ ఉన్నానని తెలుసు. కానీ నేను ఉత్తమమైన గిఫ్ట్ ఇస్తానని మాట ఇస్తున్నాను. మరెన్నో సెలబ్రేషన్ ముందున్నాయి.. ’ అని ట్వీట్ చేసాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Happy Birthday to my dear brother @tarak9999! I know I owe you a return gift. But, I promise I will give you the best. More celebrations await… 🤗 pic.twitter.com/ZW9UgmBu2G
— Ram Charan (@AlwaysRamCharan) May 20, 2020
నిజానికి రామ్ చరణ్ పుట్టిన రోజుకు ‘భీమ్ ఫర్ రామరాజు’ అంటూ చరణ్ ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ చేయగా.. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా `రామరాజు ఫర్ భీమ్` వీడియో వస్తుందని అభిమానులందరూ ఆశించారు. అయితే లాక్‌డౌన్ కారణంగా అది సాధ్యపడలేదు.



ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈసినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ‘కేజీఎఫ్’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయనున్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: