గత ఏడాది విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ ‘రాక్షసుడు’తో కెరీర్ బెస్ట్ హిట్‌ని అందుకున్నాడు యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రస్తుతం ‘కందిరీగ’ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ‘అల్లుడు అదుర్స్’ సినిమా చేస్తున్నాడు. నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ నాయికలుగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ .. చిత్రీకరణ తుది దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. తాజాగా సాయి శ్రీనివాస్ ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇంటెలిజెంట్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాని ‘స్వామి రా రా’, ‘రణరంగం’ తదితర చిత్రాల దర్శకుడు సుధీర్ వర్మ రూపొందించనున్నాడని సమాచారం. శ్రీకాంత్ అనే కొత్త రచయిత అందించిన కథతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని తెలుస్తోంది. త్వరలోనే నిర్మాత, ఇతర వివరాలు వెల్లడికానున్నాయి.
మరి.. ‘స్వామి రా రా’ తరువాత ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయిన సుధీర్.. సాయి శ్రీనివాస్ కాంబినేషన్ మూవీతోనైనా సక్సెస్ ట్రాక్‌లోకి వస్తాడేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: